Abn logo
Sep 27 2021 @ 00:26AM

పదవులు రాలేదని అధైర్యపడవద్దు

అభినందన సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు


ఎంపీపీ అభినందన సభలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు

గిద్దలూరు టౌన్‌, సెప్టెంబరు 26 :  పదవులు రాలేదని ఎవరూ అధైర్య పడవద్దని, భవిష్యత్‌లో అందరికీ అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అ న్నారు. ఆదివారం గిద్దలూరు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన కడప లక్ష్మీదేవి అభినందన సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 6 జడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలను  కైవసం చేసుకున్నామన్నారు. ఈసందర్భంగా ఎంపీపీ కడప లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నియోజకవర్గంలో చేసిన సంక్షేమ పథకాలే తన విజయానికి పునాధులని, తన గెలుపునకు సహకరించిన కంచిపల్లె గ్రామస్థులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కృష్ణచైతన్య, మాజీ ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, 6 మండలాల ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాచర్ల గేటు సెంటర్‌ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 

గ్రామంలో మరోవర్గం సన్మాన సభ

పొదలకొండపల్లె గ్రామానికి చెందిన ప్రత్యర్థి వర్గమైన జయరామిరెడ్డి, చేరెడ్డి రమణరెడ్డి, గొంటు రోషిరెడ్డి వర్గీయులు గ్రామంలో తమ మద్దతు దారులతో ర్యాలీ నిర్వహించి సమావేశం నిర్వహించారు. సమావేశానికి  జడ్పీటీసీ బుడత మధుసూదన్‌ హాజరయ్యారు. తమ వర్గీయులైన  ఎంపీటీసీ సభ్యులు సరస్వతి, సర్పంచ్‌లతోపాటు మధుకు సన్మానం చేశారు. 

న్యాయం చేయాలంటూ అసమ్మతి నేతల ధర్నా

తమకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పొదలకొండపల్లిలో సామరస్య వాతావరణం ఉన్నప్పటికీ ప్రత్యర్థులైన ఎంపీపీ కడప లక్ష్మీదేవి, ఆమె భర్త  వంశీధర్‌రెడ్డి వర్గీయులు ఘర్షణ వాతావరణం కల్పించి తమకు ఇబ్బందికర పరిస్థితి కల్పించారని, అధికార బలంతో పోలీసులతో తమను దూషించేలా చేస్తున్నారని గ్రామానికి చెందిన 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు సెంటర్‌లో ధర్నాకు దిగారు. ఆదివారం రాత్రి ఎంపీపీ వ్యతిరేక వర్గీయులైన చేరెడ్డి జయరామిరెడ్డి, రమణరెడ్డి, గొంటు రోషిరెడ్డి తమ మద్దతుదారులతో రాచర్లగేటు సెంటర్‌ వద్ద ధర్నా చేపట్టారు. పోలీసులు కేవలం  ఎంపీపీ వర్గానికే మద్దతు పలుకుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ విషయాన్ని ఎ మ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీనితో పోలీసులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, అప్పటివరకూ పోరాటం సాగిస్తామని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయం ఆలోచిస్తామంటూ పలువురు నాయకులు మాట్లాడారు.