సందేహాల్లో చిక్కకండి!

ABN , First Publish Date - 2021-01-08T06:06:59+05:30 IST

టీవీల్లో ఎక్కువ మంది చూసే కార్యక్రమం ధర్మసందేహాలు. పూజ గదిలో గంట ఏ సైజు ఉండాలి? వత్తులు రెండు పెట్టాలా?

సందేహాల్లో చిక్కకండి!

టీవీల్లో ఎక్కువ మంది చూసే కార్యక్రమం ధర్మసందేహాలు. పూజ గదిలో గంట ఏ సైజు ఉండాలి? వత్తులు రెండు పెట్టాలా? మూడు పెట్టాలా? నైవేద్యంగా అరటిపండు తొక్క తీసి పెట్టాలా? తీయకుండా పెట్టాలా? అగరవత్తులను అరటిపండుకు గుచ్చొచ్చా? ఇలాంటి సందేహాలే ఎక్కువగా అడుగుతున్నారు. ఇదా ఆధ్యాత్మికత?

శ్రీకృష్ణపరమాత్మ ఇలాంటి తేలిక రకమైన సందేహాలే కాకుండా, కాస్త ఉన్నతమైన సందేహాలనే తిట్టిపోశాడు. భగవద్గీత నాలుగో అధ్యాయం 40వ శ్లోకంలో అలాంటి సందేహాల గురించి చెప్పాడు.



అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి

నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః 

సందేహం ఎందుకొస్తుంది? అజ్ఞానం వల్ల వస్తుంది. మనంతట మనం ఆలోచించక పోవడం వల్లే చాలా సందేహాలు వస్తాయి. బుద్ధి నిలకడగా లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం వల్ల ప్రతీదీ సంశయంగానే తయారవుతుంది. అటువంటి వాళ్లకు ఎలాంటి సుఖం ఉండదు. ఎప్పుడూ ఆ సందేహాల జడిలో కొట్టుకుపోతూనే ఉంటారు. 

 గరికిపాటి నరసింహారావు


Updated Date - 2021-01-08T06:06:59+05:30 IST