దళారులను నమ్మి మోసపోవద్దు

ABN , First Publish Date - 2022-01-25T05:20:54+05:30 IST

ధాన్యం కొనుగోలులో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజయ సునీత అన్నారు. సోమవారం కొండచాకరాపల్లి రైతుభరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు.

దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులతో మాట్లాడుతున్న జేసీ విజయ సునీత

జేసీ విజయ సునీత

వంగర, జనవరి 24: ధాన్యం కొనుగోలులో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.విజయ సునీత అన్నారు. సోమవారం కొండచాకరాపల్లి రైతుభరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు.  రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ఆర్బీకేల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామని, దళారులకు అమ్మవద్దని ఆమె కోరారు. అవసరమైన హమాలీలు, రవాణా సదుపాయం, గోనె సం చులను ప్రభుత్వమే సమకూర్చుతుందన్నారు. వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. చాలా గ్రామాల్లో సిబ్బంది రైతులపై  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నారని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. గ్రామంలో రెడీగా ఉన్న ధాన్యాన్ని సమీపంలోని గొడౌన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ డీఎం పి.జయంతికి అదేశించారు,


డీఎం నిలదీత 

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని రైతులు పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ పి.జయంతిని గ్రామస్థులు నిలదీశారు. ధాన్యం కొంటామని చెబుతున్నారని, అయితే గోనె సంచులు ఎవరికి ఇచ్చా రు, మండలానికి ఎన్ని వచ్చాయో తెలపాలన్నారు. దీంతో పీఏసీఎస్‌ కోఆర్డినేటర్‌ కిరణ్‌ను ఆమె వివరణ కోరారు. అయితే ఆయన మౌనం దాల్చడంతో ఆమె అసహనం వ్యక్తంచేశారు. రైతులు వివరాల, గోనె సంచుల వివరాలు స్పష్టంగా లేకుంటే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. రైతులను మిల్లర్లు తప్పుదోవ పట్టిస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. 

 

Updated Date - 2022-01-25T05:20:54+05:30 IST