Advertisement
Advertisement
Abn logo
Advertisement

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 26: క్లిష్టమైన సమస్యలు ఎదురైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి  శాశ్వత పరిష్కారం చూపాలని,  అలసత్వం ప్రదర్శిస్తే  చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం  తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డబుల్‌ బెడ్‌రూం దరఖాస్తులతోపాటు ధరణి, కోర్టు కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు  పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.    మీ సేవ ద్వారా వచ్చే సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు చేప ట్టాలన్నారు.   సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, వేములవాడ అర్డీవో లీల, సర్వేయర్‌ శ్రీనివాస్‌, పర్యవేక్షకులు రవికాంత్‌, రమేష్‌, సుజాత, సిరిసిల్ల తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement