కరెంటు కోతలపై వదంతులు నమ్మొద్దు

ABN , First Publish Date - 2021-10-17T05:55:00+05:30 IST

విద్యుత సరఫరాలో కోతలు విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులను వినియోగదారులు నమ్మొద్దని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు శనివారం ప్రకటనలో తెలిపారు.

కరెంటు కోతలపై వదంతులు నమ్మొద్దు

అనంతపురం రూరల్‌, అక్టోబరు 16: విద్యుత సరఫరాలో కోతలు విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులను వినియోగదారులు నమ్మొద్దని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు శనివారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో విద్యుత వినియోగం రోజుకు సరాసరి 188 మిలియన యూనిట్లు ఉండగా, ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో రోజుకు 65 మిలియన యూనిట్లు ఉండేదన్నారు. ఈనెల 15 నుంచి అదనంగా రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 600 మెగావాట్లు, నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషనలో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. మొన్నటి వరకు విద్యుత ఎక్సేంజ్‌లో రూ.20 ఉన్న విద్యుత యూనిట్‌ ధర శుక్రవారం నుంచి రూ.6.11కి తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఈ వదంతులను నమ్మరాదని సూచించారు. వి ద్యుత సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబ రు 1912లో సంప్రదించాలన్నారు.


Updated Date - 2021-10-17T05:55:00+05:30 IST