ఽధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగనీయొద్దు

ABN , First Publish Date - 2021-11-28T05:17:58+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ సీతారామారావు ఆదేశించారు.

ఽధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలుగనీయొద్దు
మన్యంకొండ స్టేజీ సమీపంలో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ సీతారామారావు

- అదనపు కలెక్టర్‌ సీతారామారావు


మహబూబ్‌నగర్‌రూరల్‌, నవంబరు 27 : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ సీతారామారావు ఆదేశించారు. శనివారం ఆయన మన్యంకొండ స్టేజీ సమీపంలో కోటకదిర పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం వచ్చిన వెంటనే నాణ్యతాప్రమాణాల మేరకు ఉంటే తక్షణం కాంటాలు వేయా లని సూచించారు. రైతులు సైతం తేమలేకుండా చూసుకోవాలని చెప్పారు. అకాలవర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పీఏసీఎస్‌ అధికారులను ఆదేశించారు. కాంటాలు అయిన వెంటనే ధాన్యం లిప్ట్‌ చేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఆర్‌.పాండు, డీటీ రాజేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. 


కొనుగోలు కేంద్రాల పరిశీలన


దేవరకద్ర : మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసు కొచ్చిన ధాన్యాన్ని విక్రయించడానికి తెచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత అధికారులకు తెలిపారు. శనివారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌, పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాల్లో ధాన్యంలో తేమ శాతాన్ని ఆమె పరిశీలించారు. రైతుల సమస్య లను ఆమె అడిగి తెలుసుకున్నారు. రైతలకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. 


చక్రాపూర్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభం 


మూసాపేట : మండల పరిధిలోని చక్రాపూర్‌ గ్రామంలో శనివారం వరి కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ మంజుల శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి తాలు లేకుండా తీసుకరావాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శైలజారెడ్డి, సీఈవో భాస్కర్‌గౌడ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ దేవమ్మ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:17:58+05:30 IST