Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసాంఘిక శక్తులకు సహకరించవద్దు

కాసిపేట, డిసెంబరు 7: అసాంఘిక శక్తులకు సహకరించవద్దని ఏసీపీ ఎడ్ల మహేష్‌ అన్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మారుమూల ప్రాంతా లైన కుర్రెఘాడ్‌, కొలాంగూడ లక్ష్మీపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఏసీపీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లోని యువకులు మావో యిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు.  చక్క గా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం 200 గిరిజన కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు. సీఐ ప్రమోద్‌రావు, దేవా పూర్‌ ఎస్‌ఐ విజయేందర్‌, సర్పంచు సౌందర్యశంకర్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement