అర్హులకు దక్కని చేదోడు

ABN , First Publish Date - 2021-10-11T06:36:28+05:30 IST

ప్రభుత్వ పథ కాలకు అన్ని అర్హతలూ ఉన్నా ఏదో ఒక సాకు చూపి లబ్ధిదారులను తొలగించే పనిలో పడ్డారు అ ధికారులు. జగనన్న చేదోడు పథకానికి వేల నిబంధనలు విధిస్తూ లబ్ధి అందకుండా చేస్తున్నారు.

అర్హులకు దక్కని చేదోడు

లబ్ధిదారుల జాబితాలో కోతలు  

 అర్హతలున్నా అడ్డగోలు  నిబంధనలతో తొలగింపు

 అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధిత లబ్ధిదారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 10: ప్రభుత్వ పథ కాలకు అన్ని అర్హతలూ ఉన్నా ఏదో ఒక సాకు చూపి లబ్ధిదారులను తొలగించే పనిలో పడ్డారు అ ధికారులు. జగనన్న చేదోడు పథకానికి వేల నిబంధనలు విధిస్తూ లబ్ధి అందకుండా చేస్తున్నారు.  ఏదైనా ప్రభుత్వ పథకం వ ర్తించినట్లైతే చేదోడు పథకం వర్తించదని తాజాగా వెల్ఫేర్‌ అసిస్టెంట్లు చేస్తున్న సర్వేలో విస్తుపోయే నిజాలు బయట పడు తున్నాయి. కనీసం రెండు ఎకరాల భూమి ఉన్నా కూడా రైతుభరోసా వస్తుంది. మీకు చేదోడు రాదని క్షేత్రస్థాయి పరిశీలనలో లబ్ధిదారులకు తెగేసి చెబుతున్నా రు. దీంతో అర్హులైన లబ్ధిదారుల నుంచి తీవ్ర  అసం తృప్తి వ్యక్తం అవుతోంది.


ఇవీ నిబంధనలు...

జగనన్న చేదోడు పథకానికి నిబంధనలు విధించారు. వృత్తి చేసుకునే రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లు అర్హులు. 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు. గతేడాది 60 ఏళ్ల వయస్సు ఉన్న వారి పేర్లు ఈ ఏడాది తొలగిస్తారు. ఈనెల 7వ తేదీ నుంచి ఆయా గ్రామ, వార్డు వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, కార్యదర్శుల ద్వారా లబ్దిదారుల అర్హతలు, ఎవరైనా మృతి చెందారా లేక దుకాణాలు నిర్వహిస్తున్నారా లేదా అనే తదితర అంశాలను పరిశీలిం చారు. అర్హతలు ఉన్నప్పటికీ కొన్ని పేర్లు తొలగించారు. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సామాజిక తనిఖీ ద్వారా జాబితాలను పరిశీలించారు. ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాబితాలను మరోసారి పరిశీలించి అర్హుల జా బితాను ఉన్నతాఽధికారులకు పంపాల్సి ఉంటుంది. సచివాల యాల్లో జాబితాలలో అభ్యంతరాలను పరిశీలించిన అనం తరం బీసీ కార్పొరేషన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ద్వారా, ఈనెల 21వతేదీలోపు జిల్లా కలెక్టర్‌ ద్వారా ఆమోదం పొందాలి. 


3485 మందికి మొండిచెయ్యి

జిల్లాలో గతేడాది జగనన్న చేదోడు జాబితా నుంచి ఈ ఏడాది 3485 మంది పేర్లను తొలగించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రజకులు 12349 మంది, నాయీబ్రాహ్మణులు 4395 మంది, టైలర్లు 5105 మంది మొత్తం 21849 లబ్ధిదారులకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. 2020-21 సంవత్సరానికి రజకులు 10344 మంది, నాయీ బ్రాహ్మణులు 3491 మంది, టైలర్లు 4529 మంది మొత్తం 18364 మంది పేర్లు జాబితాలో ఉన్నాయి. దీంతో గతేడాదితో పోలిస్తే  ఈఏడాది 3485 మంది పేర్లు గల్లంతయ్యాయి.  



అర్హులందరికీ చేదోడు వస్తుంది : నాగముని, ఈడీ, బీసీ కార్పొరేషన  

అర్హులందరికీ చేదోడు పథకం వర్తిస్తుంది.  ఇప్పటికే రిజిసే్ట్రషన చేసుకున్న వారి పేర్ల పరిశీలన, సర్వే చేస్తున్నా రు. ఈ ప్రక్రియ మొత్తం 9రకాలుగా ఉంటుంది. నిబంధ నలకు లోబడే అర్హుల జాబితాలను ఎంపిక చేస్తాం. రిజి సే్ట్రషన చేసుకున్న కొత్తవారిలో అర్హులు ఉంటే వారికి కచ్చి తంగా అవకాశం ఉంటుంది. త్వరలో జగనన్న చేదోడు లబ్ధిదారుల జాబితాలోని పేర్ల ఖాతాలలో నగదు జమ చేస్తాం. 

Updated Date - 2021-10-11T06:36:28+05:30 IST