ప్రకృతివనాన్ని నాశనం చేయకండి: జనసేన

ABN , First Publish Date - 2021-06-24T07:17:46+05:30 IST

తిరుపతి నగరానికి తలమానికమైన కపిలతీర్థం- అలిపిరి రోడ్డులోని ప్రకృతి వనాన్ని నాశనం చేయొద్దని టీటీడీని జనసేనపార్టీ కన్వీనర్‌ కిరణ్‌రాయల్‌ కోరారు.

ప్రకృతివనాన్ని నాశనం చేయకండి: జనసేన
మాట్లాడుతున్న కిరణ్‌రాయల్‌

తిరుపతి(తిలక్‌రోడ్డు), జూన్‌ 23: తిరుపతి నగరానికి తలమానికమైన కపిలతీర్థం- అలిపిరి రోడ్డులోని ప్రకృతి వనాన్ని నాశనం చేయొద్దని టీటీడీని  జనసేనపార్టీ కన్వీనర్‌ కిరణ్‌రాయల్‌ కోరారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కపిలేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా కపిలతీర్థం నుంచి అలిపిరి వరకు స్వామివారిని ఊరేగిస్తారన్నారు. గరుడవారధి నిర్మిస్తే ఉత్సవాలకు అటంకం ఏర్పడుతుందన్నారు. అలిపిరి వరకు వారధి నిర్మాణం చేపట్టితే ఆగమశాస్త్ర ప్రకారం అరిష్టమన్నారు. పచ్చని చెట్లు, కొండలను నాశనం చేసి గరుడవారధి నిర్మించాలన్ని నిర్ణయాన్ని టీటీడీ పాలకమండలి వెనక్కి తీసుకోవాలన్నారు. మొదట గరుడవారధి ప్రారంభమై మూడేళ్లు అవుతున్నా టీటీడీ వాటా రూ.450 కోట్లు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. వెంటనే ఆ మొత్తాన్ని కేటాయించి సకాలంలో వారధిని నిర్మించడం ద్వారా ప్రజల కష్టాలు తీర్చాలన్నారు. నాయకులు స్వలాభం కోసం రెండో వారిధిని నిర్మించాలనుకుంటారని ఆరోపించారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నప్పుడు టీటీడీ ఎందుకు సహకరించలేదని తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు పగడాల మురళి, ఆకేపాటి సుభాషిణి, అమృత, మనస్వామి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T07:17:46+05:30 IST