Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

-   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఇల్లంతకుంట, డిసెంబరు 2: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. మండలంలోని అనంతారం, ముస్కానిపేట, పత్తికుంటపల్లె, ఇల్లంతకుంట గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తూకం వేయాలని సూచించారు. ఇబ్బందులు తలెత్తితే ఉన్నతస్థాయి అధికారులకు సమాచారం అందించాలన్నారు. మండలంలోని పత్తికుంటపల్లెలో  ఆరుగురు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటే వందశాతం పూర్తి అవుతున్నందున వారిని ప్రోత్సహించాలని వైద్యసిబ్బందికి  సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ముస్కానిపేటలో అంగన్‌వాడీ పిల్లలతో కలెక్టర్‌ ముచ్చటించారు. పల్లెప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో రవీందర్‌, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ హరికృష్ణ, తహసీల్దార్‌ బావుసింగ్‌, ఎంపీడీవో రాజు, వైద్యాధికారి సుభాషిణి, ఏపీవో చంద్రయ్య, సర్పంచులు చల్ల నారాయణ, భాగ్యలక్ష్మి, ఎలుక లక్ష్మి, చింతలపెల్లి శ్రీలత, ఎంపీటీసీ గొడిశెల వనజఅనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement