గర్భిణులు ప్లాస్మా దానం చేయొద్దు

ABN , First Publish Date - 2020-07-04T07:11:54+05:30 IST

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ లేని ప్రస్తుత తరుణంలో ప్లాస్లా థెరపి విధానం రోగులకు ఆశాకిరణంగా మారింది. అయితే ప్లాస్మాను దానం చేసే విషయంలో మహిళలకు కొన్ని పరిమితులున్నాయి. ఇప్పటి వరకు గర్భం దాల్చని మహిళలను

గర్భిణులు ప్లాస్మా దానం చేయొద్దు

న్యూఢిల్లీ, జూలై 3: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ లేని ప్రస్తుత తరుణంలో ప్లాస్లా థెరపి విధానం రోగులకు ఆశాకిరణంగా మారింది. అయితే ప్లాస్మాను దానం చేసే విషయంలో మహిళలకు కొన్ని పరిమితులున్నాయి. ఇప్పటి వరకు గర్భం దాల్చని మహిళలను మాత్రమే ప్లాస్మా దానం చేయడానికి అనుమతినిస్తున్నారు. గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో హ్యూమన్‌ ల్యూసోసైట్‌ యాంటీజెన్స్‌(హెచ్‌ఎల్‌ఏ) అ నే ప్రతి నిరోధకాలు ఏర్పడతాయి. ఇవి జీవితాంతం వారి రక్తంలోనే ఉండిపోతాయి. ప్లాస్మాను దానం చే సే క్రమంలో ఇవి ఇతరుల(స్వీకర్త) శరీరంలోకి చేర తాయి. దాంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణం పోవచ్చు. కాబట్టి గర్భం దాల్చిన వారిని ప్లాస్మా దాతలుగా అనుమతించడం లేదు.

Updated Date - 2020-07-04T07:11:54+05:30 IST