Abn logo
Oct 21 2021 @ 23:26PM

మత్స్యకారులను ఎస్టీలో చేర్చవద్దు

నిరసన తెలుపుతున్న గిరిజన విద్యార్థులు

పలాస: మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తే ఆందోళనకు దిగుతామని ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర జగ న్నాయకులు హెచ్చరించారు. గురువారం స్థానిక ఎస్టీ పో స్ట్‌ మెట్రిక్‌ హాస్టల్‌ వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని ఇటీవల కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే  ప్రకటించడాన్ని ఖండించారు.