Abn logo
Oct 27 2021 @ 23:06PM

రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచొద్దు

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

          - ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి

ఉలవపాడు, అక్టోబరు 27 : రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించి సమాధానం చెప్పాలని కందుకూరు శాసన సభ్యుడు మానుగుంట మహీధర్‌ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక ప్రజా స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టాదారు పాసుపుస్తకాలు, భూముల ఆన్‌లైన్‌ రికార్డు పనులు, భూ సర్వేపనులను వాయిదాలు వేయకుండా వెనువెంటనే రికార్డుల పరంగా పని చేసిపెట్టాలని తహసీల్దార్‌ కే సంజీవరావును కోరారు. స్థానిక సమస్యలకు సంబంధించిన అర్జీలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చెంచమ్మ, పంచాయతీ కార్యదర్శుతో మాట్లాడారు.