చాణక్య నీతి: పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ ఇటువంటి పనులు చేయకూడదు... వారు చెడిపోవడానికి కారణాలివే!

ABN , First Publish Date - 2021-10-05T12:14:00+05:30 IST

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ విలువలను అందించాలని...

చాణక్య నీతి: పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ ఇటువంటి పనులు చేయకూడదు... వారు చెడిపోవడానికి కారణాలివే!

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ విలువలను అందించాలని చాణక్య నీతి చెబుతోంది. జాతి నిర్మాణంలో సంస్కారవంతులైన పిల్లలు మాత్రమే ప్రముఖపాత్ర పోషిస్తారు. అందువల్ల తల్లిదండ్రులంతా తమ పిల్లల విషయంతో ఎంతో జాగ్రత్తగా మెలగాలి. చాణక్య నీతి ప్రకారం, పిల్లలకు విద్య, ఆచార వ్యవహారాల గురించి తల్లిదండ్రులు తరచూ చెబుతుండాలి. తమ పిల్లలు తమకు పేరు తీసుకురావాలని, వారి భవిష్యత్ అద్భుతంగా ఉండాలని తల్లిదండ్రులు పరితపిస్తుంటాటు. అయితే ఇది అంత సులభం కాదు.


చాణక్య నీతి ప్రకారం, తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా పిల్లలపై మంచి ప్రభావం చూపగలిగితేనే... వారి కల నెరవేరడంతో పాటు పిల్లల భవిష్యత్ ఉన్నతంగా ఉంటుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లలు... తల్లిదండ్రులు చేసే పనులను చూసి, వాటిని అనుకరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు నిత్యం గుర్తుంచుకోవాలి.

మాట్లాడే తీరు:  చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి మాట్లాడే తీరుతెన్నులే అతని ప్రవర్తనను తెలియజేస్తాయి. అందుకే  తల్లిదండ్రులు తాము మాట్లాడే తీరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. చాణక్య నీతి ప్రకారం, పిల్లల మాట తీరు చక్కగా ఉండాలంటే, ముందుగా తల్లిదండ్రులు తమ మాట తీరును మెరుగుపరుచుకోవాలి. సంస్కారవంతంగా మాట్లాడుతుండాలి. 


గౌరవం:  చాణక్య నీతి ప్రకారం తల్లిదండ్రులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు, ఇతరులతో  మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా మెలగాలి. తల్లిదండ్రుల ప్రవవర్తనలో గౌరవం అనేది లేనట్లయితే... అది పిల్లల మనసులపై తీవ్ర ప్రభాం చూపుతుంది. ఫలితంగా వారు కూడా చెడుగా ప్రవర్తించేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రులు గౌరవభావంతో మెలగాలి. 

అబద్దాలు, తప్పుడు పనులు: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం, తప్పుడు పనులు చేయడం తగదు. పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ఉండాలన్నా, తప్పుడు పనుల జోలికి వెళ్లకుండా ఉండాలన్నా, ముందుగా తల్లిదండ్రులు ఇటువంటి చెడు ప్రవర్తనకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల సంస్కారవంతమైన ప్రవర్తన ద్వారానే పిల్లలకు బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది. 

Updated Date - 2021-10-05T12:14:00+05:30 IST