ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు

ABN , First Publish Date - 2021-09-19T05:17:40+05:30 IST

ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 18సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని కలెక్టర్‌ వ ల్లూరు క్రాంతి అన్నారు.

ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు
పట్టణంలోని ఇండోఇంగ్లీష్‌ సెంటర్‌లో వ్యాక్సిన్‌ వివరాలను తెలుసుకుంటున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- జిల్లా కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కేంద్రాల తనిఖీ  

గద్వాల క్రైం, సెప్టెంబరు 18: ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 18సంవత్సరాలు పైబడిన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పక వేయించుకోవాలని కలెక్టర్‌ వ ల్లూరు క్రాంతి అన్నారు. శనివారం పట్టణంలోని ప్రాక్టిసింగ్‌, ఇండోఇంగ్లీష్‌ పాఠశాలలతో పాటు గంజిపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాలను  కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మా ట్లాడుతూ వ్యాక్సిన్‌ విషయంలో ఎవరు భయాందోళన కు గురికాకుండా అందరు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు. వార్డుల వారి గా 18సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ఉ న్నారు.. ఎంతమంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు.. ఇంకా ఎం తమంది వేయించుకోలేదని ఆరా తీశారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.  కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్‌ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయ క్‌, అధికారులు, నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-09-19T05:17:40+05:30 IST