ఓట్ల లెక్కింపులో తప్పిదాలకు తావివ్వొద్దు

ABN , First Publish Date - 2021-09-18T05:59:03+05:30 IST

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శుక్రవారం ఇక్కడ అధికారులు శిక్షణ శిబిరాన్ని నిర్వ హించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.రవి కుమార్‌ మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు జరి గిన 27 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రంలో 27 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నామన్నారు.

ఓట్ల లెక్కింపులో తప్పిదాలకు తావివ్వొద్దు
పాయకరావుపేటలో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న రిటర్నింగ్‌ ఆఫీసర్‌ రవికుమార్‌

   సిబ్బంది శిక్షణ శిబిరంలో ఆర్‌వో రవికుమార్‌ ఆదేశం 

 వివిధ పార్టీల నాయకులకు సూచనలు

పాయకరావుపేట/ నక్కపల్లి, సెప్టెంబరు 17 : పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి శుక్రవారం ఇక్కడ అధికారులు శిక్షణ శిబిరాన్ని నిర్వ హించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.రవి కుమార్‌ మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు జరి గిన 27 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రంలో 27 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నామన్నారు. ఒక్కో టేబుల్‌కి సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారన్నారు. లెక్కింపులో ఎటువంటి తప్పిదాలు జరగకుండా పనిచేయాలన్నారు.  పలు వురు రిసోర్స్‌ పర్సన్లు ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో  సాంబశివరావు, తహసీల్దారు అంబేడ్కర్‌, ఈఓపీఆర్డీ పి.వెంకటనారాయణ తదిత రులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆర్‌వో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇది లావుంటే, ఎన్నికల కౌంటింగ్‌పై నక్కపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు శిక్షణ శిబిరం ఏర్పాటైంది.  ఈ కార్య క్రమంలో మం డల ప్రత్యేకాధికారి డాక్టర్‌ సుధాకర్‌, ఎంపీడీవో రమేశ్‌రామన్‌లు పలు సూచనలు చేశారు. ఎంఈవో డీవీడీ ప్రసాద్‌, రిసోర్స్‌పర్సన్‌ డీవీఎస్‌ఎస్‌  ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:59:03+05:30 IST