ప్రభుత్వ పనుల్లో అశ్రద్ధ చేయొద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-04T10:53:32+05:30 IST

కోవిడ్‌-19 ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని, అలాగని అధికారులు ప్రభుత్వ పనులు, కార్యక్రమాలను అశ్రద్ధ చేయొ ద్దని కలెక్టర్‌

ప్రభుత్వ పనుల్లో  అశ్రద్ధ చేయొద్దు : కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 3: కోవిడ్‌-19 ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని, అలాగని అధికారులు ప్రభుత్వ పనులు, కార్యక్రమాలను అశ్రద్ధ చేయొ ద్దని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో అధికారులతో హరి తహారం, రైతు వేదికలు, శానిటైజేషన్‌. డంపింగ్‌ యార్డులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లేబర్‌ టర్న్‌ ఔట్‌ తదితర అంశాల నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కారోనా కారణంగా ప్రజావాణి కూడా ఫోన్‌ఇన్‌ ద్వారా నిర్వహిస్తు న్నట్లు తెలిపారు.


సిబ్బందికి కరోనా లక్షనాలు ఉంటే వెంట నే టెస్టు చేయించాలన్నారు. ప్రతి జిల్లా అధికారి లక్ష్యాన్ని చేరుకునేలా పని చేయాలన్నారు. ప్రతి శాఖకు సంబంధిం చిన ప్రభుత్వ భూముల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చే యాలన్నారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ, నేష్నల్‌ హై వే రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఎఫ్‌ వో సునీల్‌ హీరామత్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


జిల్లా వ్యాప్తంగా 112 వినతుల స్వీకరణ 

కోవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రజా వాణికి ఫోన్‌ ద్వారా, ఈమెయిల్‌ ద్వారా, ఇతర మార్గాల ద్వారా వినతులు స్వీకరిస్తున్నారు. సోమవారం జిల్లా వ్యా ప్తంగా 112 వినతులు స్వీకరించారు. కలెక్టరేట్‌లో బాక్సులో 65, ఫోన్‌ ద్వారా 21, వాట్సాఫ్‌ ద్వారా 5, ఈమెయిల్‌ ద్వారా 9 మొత్తం వంద వినతులు, డీపీవో కా ర్యాలయంలో ఈ మెయిల్‌ ద్వారా రెండు, ఆర్డీవో కార్యాలయంలో  వాట్సఫ్‌ ద్వారా 4, బోధన్‌ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదుల బాక్సు ద్వారా 2, ఆర్మూర్‌ ఆర్డీవో కార్యాలయంలో ఫోన్‌ ద్వారా 2, వాట్సాప్‌ ద్వారా 2 మొత్తం 4 వినతులు స్వీకరించారు. 

Updated Date - 2020-08-04T10:53:32+05:30 IST