Abn logo
Sep 20 2021 @ 01:26AM

కరోనా వ్యాక్సిన్‌ పట్ల నిర్లక్ష్యం వొద్దు

బోథ్‌లో వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారితో మాట్లాడుతున్న ఎంపీడీవో

కొవిడ్‌ 19 టీకా తీసుకోవడం అందరి బాధ్యత : ఎంపీడీవో రాధ
జిల్లావ్యాప్తంగా  జోరుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

బోథ్‌, సెప్టెంబరు 19: వ్యాక్సిన్‌ తీసుకుని కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ఎంపీడీవో రాధా కోరారు. ఆదివారం బోథ్‌లోని 14వార్డులో పలుచోట్ల వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వ్యాక్సిన్‌ సెంటర్లను సందర్శించి టీకా వేసుకునే వారికి ధైర్యాన్ని నింపారు. వ్యాక్సిన్‌ పట్ల ఎలాంటి అపోహాలు వద్దని వ్యాక్సిన్‌ కరోనా నుంచి కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కుర్మె మహేందర్‌, షేక్‌రజియా, కార్యదర్శి అంజన్న, తదితరులు ఉన్నారు.
సిరికొండ: మండలంలోని రాయిగూడ, పోచంపల్లి, వాయిపేట్‌, చెమ్మన్‌గుడి, తదితర గ్రామాలలో  కొనసాగుతున్న వ్యాక్సి నేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను జడ్పీ సీఈవో గణపతి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన  ప్రతీఒక్కరూ కరోనా టీకాను తీసుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ వో సురేష్‌, సర్పంచ్‌లు మడావి జయాబాయి లచ్చు, లక్ష్మీ క్రిష్ణ, పెందూర్‌ లక్ష్మీబాయి గంగాధర్‌, పంచాయతీ కార్యదర్శులు, తదితరులున్నారు.
జైనథ్‌: మండలంలోని 42గ్రామ పంచాయతీ ల పరిధిలో 18ఏళ్లు నిండిన ప్రతీఒక్కరు టీకాను వేయించుకోవాలని జడ్పీటీసీ తుమ్మల అరుంధతి అన్నా రు. ఆదివారం మండలంలోని మాండగడ, గిమ్మా గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో గిమ్మా, మాండగడ సర్పంచ్‌ లు పరమేశ్వర్‌, మహేందర్‌రావ్‌, ఎంపీటీసీలు కోలభోజన్న, ప్రశాంత్‌రెడ్డి, గిమ్మా ఫార్మాసిస్టు విజయలక్ష్మి, ఏఎన్‌ఎం లీలా,  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్‌ రూరల్‌: 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ వేయించాలన్న సంకల్పంతో ప్రభుత్వం తాజాగా గ్రామాల్లోకి వెళ్లి కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని పాట్నాపూర్‌, కరత్వాడ, ఇంకర్‌పల్లి, సాయినగర్‌లలో కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కొవిడ్‌ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
తలమడుగు: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రతీ పంచాయతీలో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ఎంపీఈవో దిలీప్‌కుమార్‌ కోరారు. ఆదివారం మండలంలోని సుంకిడి, లింగి, తలమడుగు, దేవాపూర్‌, ఝరి, కుచ్లాపూర్‌, నందిగామ, తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోను తలమడుగు మండలంలో ఎక్కువగా వ్యాక్సినేషన్‌ వేయించడం జరిగిందన్నారు. ఇందు లో మండల వైద్యాధికారి డా.రాహుల్‌, సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీలు, తదితరులున్నారు.
ఉట్నూర్‌ రూరల్‌: మండలంలోని శ్యాంపూర్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ను డివిజనల్‌ పంచాయతీ అధికారి బొమ్మ భిక్షపతిగౌడ్‌, వైస్‌ ఎంపీపీ దావులే బాలాజీ ఆదివారం పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్‌ వేసుకునేలా వైద్య సిబ్బంది చూడాలని అన్నారు.   
నేరడిగొండ: మండలంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది  18ఏళ్లు నిండిన వారందరికీ ఆదివారం ఆరోగ్య సిబ్బంది కరోనా వ్యాక్సి నేషన్‌ మొదటి, రెండో డోసును అందించారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోందని వైద్యాధికారి ఆనంద్‌కుమార్‌ అన్నారు. ప్రజలు స్వచ్చంధంగా కరోనా వ్యాక్సినేషన్‌ ను వేయించుకోవాలన్నారు, కరోనా టీకా తీసుకుంటే కరోనా వ్యాప్తిని ఆరికట్టవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత కరోనా టీకాలను అందిస్తున్నాయని, అందరూ టీకా వేయించుకోవాలని కోరారు.   
ఫ భీంపూర్‌లో శతాధిక వృద్ధుడికి టీకా
భీంపూర్‌: మండల కేంద్రంలో ఆదివారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ శిబిరం నిర్వహించారు. ఇక్కడ చౌహాన్‌విఠల్‌ అనే శతాధిక వృద్ధుడు మొదటి డోసు టీకాను వేసుకున్నాడు. దీంతో స్థానికుల్లో మరింత ఉత్సాహాం పెరిగింది.