వైరస్‌ తగ్గుతోందంటూ నిర్లక్ష్యం వద్దు: రమేష్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-30T02:04:24+05:30 IST

తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌లో పాజిటివ్ రేటు 3 శాతం మాత్రమేనని, వైరస్‌ తగ్గుతోందంటూ నిర్లక్ష్యం వద్దని ఆయన హెచ్చరించారు.

వైరస్‌ తగ్గుతోందంటూ నిర్లక్ష్యం వద్దు: రమేష్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌లో పాజిటివ్ రేటు 3 శాతం మాత్రమేనని, వైరస్‌ తగ్గుతోందంటూ నిర్లక్ష్యం వద్దని ఆయన హెచ్చరించారు. ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు కంటిన్యూ చేయాలన్నారు. జూన్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని పేర్కొన్నారు. నల్గొండ, వరంగల్ వంటి జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వాస్పత్రుల్లో 22 వేల పడకలకు గాను 8 వేలు కరోనాకు కేటాయించామని రమేష్‌రెడ్డి చెప్పారు. 12 వేలకు పైగా బెడ్లకు ఆక్సిజన్ వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా, తాలుకా స్థాయి ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని రమేష్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-30T02:04:24+05:30 IST