మౌలిక వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2021-06-20T04:44:37+05:30 IST

రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయవద్దని ఆర్డీవో నాగన్న సూచించారు.

మౌలిక వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యం వద్దు
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో నాగన్న

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 19:  రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల ఏర్పాటులో నిర్లక్ష్యం చేయవద్దని  ఆర్డీవో నాగన్న సూచించారు. శనివారం  జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో  రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని హౌసింగ్‌ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ కాలనీల్లో నీటిసరఫరా, లేఅవుట్లు తదితరవన్నీ సిద్ధం చేయాలన్నారు. హౌసింగ్‌ డీఈ ఎం.కృష్ణయ్య మాట్లాడుతూ కాలనీల్లో హౌసింగ్‌కు సంబంధించి  పనులు  వేగవంతంగా చేపట్టనున్నామన్నారు. అలాగే ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ విజయభాస్కర్‌ మాట్లాడుతూ  హౌసింగ్‌, నీటి బోర్లు ఎక్కడెక్కడ అవసరమో సమస్యలు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు.  కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

సున్నపురాళ్లపల్లెలో 

డీకేటీ భూములపై విచారణ చేయాలి

జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంబంధించి డీకేటీ భూములను ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి అర్హులైనవారికి పరిహారం ఇవ్వాలని ఏడవ అసైన్‌మెంట్‌ బాధిత రైతులు ఆర్డీవో నాగన్నను కోరారు. ఆమేరకు ఆర్డీఓకు వారొక  వినతి పత్రం అందజేశారు. ఏడవ అసైన్‌మెంట్‌లో సుమారు 250 మందికిపైగా భూమిలేని నిరుపేద రైతులు ఉన్నారన్నారు. 2013లో ఒక్కొక్కరికి ఒక ఎకరా చొప్పున అసైన్‌మెంట్‌ భూమి ఇవ్వడంతోపాటు ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి పరిహారం ఇస్తున్నారని అందులో ఏడవ విడత అసైన్‌మెంట్‌లో రైతులకు మొండిచేయి చూపించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. విషయంపై విచారణ చేసి గ్రామంలో లేనివారిని భూ ములను అర్హులకు అందేలా చూడాలని వారు కోరారు.  కార్యక్రమంలో సున్నపురాళ్లపల్లె  బాధిత రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:44:37+05:30 IST