సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

ABN , First Publish Date - 2022-01-28T04:59:49+05:30 IST

సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాస్‌

కొడంగల్‌, జనవరి 27 : సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టరీత్యా చర్యలు తప్పవని పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ హెచ్చరించారు. గురువారం కొడంగల్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే పోస్టులు, ప్రసంగాలు పోస్ట్‌ చేస్తే గ్రూప్‌ అడ్మిన్‌లపై కేసులు నమోదు చేస్తామన్నారు. కాగా, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. రెచ్చగొట్టే పోస్టులు, ప్రసంగాలు పెడితే 504, 506, 509 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు సైతం రాజకీయ విమర్శలు చేయాలే తప్ప.. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమావేశంలో కొడంగల్‌ సీఐ అప్పయ్య, ఎస్సై సామ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:59:49+05:30 IST