రుణాల చెల్లింపులో డ్వాక్రా సభ్యులపై ఒత్తిడితేవొద్దు

ABN , First Publish Date - 2020-04-09T12:18:38+05:30 IST

రుణ వాయిదాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యులపై బ్యాంకర్లు, ఏపీఎంలు, సీసీలు, సంఘమిత్రలు

రుణాల చెల్లింపులో డ్వాక్రా సభ్యులపై ఒత్తిడితేవొద్దు

డీఆర్‌డీఏ పీడీ మురళి


చిత్తూరు అర్బన్‌, ఏప్రిల్‌ 8: రుణ వాయిదాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాల సభ్యులపై బ్యాంకర్లు, ఏపీఎంలు, సీసీలు, సంఘమిత్రలు ఒత్తిడి తేవొద్దని డీఆర్‌డీఏ పీడీ ఎం.ఎ్‌స.మురళి ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోందన్నారు. ఈ నేపథ్యంలో రుణ వాయిదాల చెల్లింపులపై రిజర్వు బ్యాంకు మూడునెలల మారటోరియం విధించినట్లు గుర్తుచేశారు. కాగా, డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదని చెప్పారు.


అయితే రుణ వాయిదా చెల్లింపులపై ఈనెల మాత్రం మినహాయింపునిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలందాక రుణాల రికవరీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థికస్థోమత ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులు వాయిదాలు చెల్లించవచ్చని సూచించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి సభ్యులపై ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-04-09T12:18:38+05:30 IST