నాకేం బాధ లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!

ABN , First Publish Date - 2021-01-16T23:49:15+05:30 IST

నాలుగో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతున్న సమయంలో అనవసర షాట్‌కు యత్నించి అవుటైన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

నాకేం బాధ లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!

బ్రిస్బేన్: నాలుగో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతున్న సమయంలో అనవసర షాట్‌కు యత్నించి అవుటైన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇలా అవుటైనందుకు తానేమీ బాధ పడటం లేదని రోహిత్ సమాధారం ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్-ఆసీస్ మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ 74 బంతుల్లో 44 పరుగులు చేసిన తరుణంలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పుడు భారీషాట్ కొట్టేందుకు రోహిత్ ప్రయత్నించాడు.


అయితే అది మిస్ అయ్యి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ షాట్ ఆడినందుకు రోహిత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా రోహిత్‌ను తప్పుబట్టాడు. అయితే తాను ఏ షాట్ ఆడాలనుకున్నానో ఆ షాట్ ఆడానని, కాకపోతే బంతిని సరిగ్గా అందుకోలేక పోయానని రోహిత్ చెప్పాడు. ఇలా అవుటైనందుకు తానేమీ బాధ పడటం లేదని స్పష్టం చేశాడు. బౌలర్‌పై ఒత్తిడి పెంచాలని అనుకున్నానని, ఓ బ్యాట్స్‌మెన్‌గా అది తన బాధ్యతని అన్నాడు.



Updated Date - 2021-01-16T23:49:15+05:30 IST