‘కల్యాణలక్ష్మి’ కోసం దళారులను ఆశ్రయించవద్దు

ABN , First Publish Date - 2021-07-25T04:11:30+05:30 IST

కల్యాణలక్ష్మి పథకం కోసం దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గతంలో పర్యాటక ప్రాంతం పాపికొండలు పడవ ప్రమాదంలో మరణించిన రెండు కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహార చెక్కును బాధితులకు అందజేశారు.

‘కల్యాణలక్ష్మి’ కోసం దళారులను ఆశ్రయించవద్దు
కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

హాజీపూర్‌, జూలై 24: కల్యాణలక్ష్మి పథకం కోసం దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 67 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. గతంలో పర్యాటక ప్రాంతం పాపికొండలు పడవ ప్రమాదంలో మరణించిన రెండు కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహార చెక్కును బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పేదింటి ఆడపడుచుల వివాహానికి రూ.1లక్షా116 అందజేస్తున్నారన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో ఎవరైనా డబ్బులడిగితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సోమవారం నుంచి కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని, త్వరలోనో 57 యేండ్ల వయసు నిండిన వారికి పింఛన్‌ ఇస్తామన్నారు. తహసీల్దార్‌ వాసంతి, ఎంపీడీవో ఎంఏ హై, ఎంపీపీ స్వర్ణలత శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ రమాదేవి రవి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, జడ్పీ కోఆప్షన్‌ నయింపాషా పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T04:11:30+05:30 IST