వైసీపీని సాగనంపే వరకూ విశ్రమించవద్దు: కందుల నారాయణరెడ్డి

ABN , First Publish Date - 2022-01-20T04:25:07+05:30 IST

అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపి, మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకూ విశ్రమించవద్దని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు

వైసీపీని సాగనంపే వరకూ విశ్రమించవద్దు: కందుల నారాయణరెడ్డి
కార్యకర్తలతో మాట్లాడుతున్న కందుల

పొదిలి(రూరల్‌), జనవరి 19 : అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని సాగనంపి, మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకూ విశ్రమించవద్దని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పొదిలిలోని విశ్వనాథపురంలో 11వ వార్డు బూత్‌ కమిటీలను ఆయన బుధవారం నియమించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కందుల మాట్లాడుతూ 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలన్నారు. బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడవద్దని, తాము అండగా ఉంటామని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూనే వైసీపీ పాలకుల అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. రెండున్నరేళ్లకే రాష్ట్రాన్ని అథోగతి పాలుజేయడంతోపాటు ప్రజలను కష్టాల్లోకి నెట్టిన వైసీపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారని చెప్పారు. ఏక్షణాన ఎన్నికలు వచ్చినా వారిని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ పథకాలకు పేరు మార్చి, మంచి పథకాలకు మంగళం చెప్పి, అభివృద్ధికి పాతర వేశారని చెప్పారు. పథకాల పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాల వల్ల ప్రజలకు ఎలాంటి సేవలూ అందడం లేదని కందుల విమర్శించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు పెదబాబు, మండల పార్టీ అధ్యక్షుడు ఎం.ఓబులరెడ్డి, పట్టణాధ్యక్షుడు ఖుద్దూష్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఇమాంసా, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర నాయకులు అనిల్‌, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎస్‌ఎం బాషా, పట్టణ మైనార్టీ నాయకులు మస్తాన్‌, మండల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మస్తాన్‌వలి, పట్టణ ప్రచార కార్యదర్శి కాశిం, 9వ వార్డు బూత్‌  కన్వీనర్‌ వీరిశెట్టి సురేష్‌, ఎస్సీసెల్‌ మాజీ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు,  షేక్‌ మస్తాన్‌, మామిళ్లపల్లి వెంకటేశ్వరరావు, కారంశెట్టి వెంకటేశ్వరరావు, జ్యోతి మల్లికార్జున్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


వైసీపీ వైఫల్యాలను ఎండగట్టాలి 

కొనకనమిట్ల :  వైసీపీ పాలకుల వైఫల్యాలను ఎండగట్టాలని  మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని చింతగుంట, బురదపాలెం గ్రామా లలో బుధవారం బూత్‌ కమిటీలను ఆయన నియమించారు.  ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ  వైసీపీ ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను  ప్రజలకు తెలియజేయాలన్నారు.  పార్టీ అభ్యున్నతికి శ్రేణులు ఇప్పటి నుంచే పాటుపడాలన్నారు.  కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మోరబోయిన బాబురావు, మాజీ  అధ్యక్షుడు కనకం నరసింహారావు, పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్‌ చప్పిడి రామలింగయ్య, పార్లమెంట్‌ తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి కాటంరాజు, తెలుగుయువత అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌, వెలుగొండ దేవస్థాన మాజీ చైర్మన్‌ కాశీరెడ్డి, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మార్కాపురం మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ సయ్యద్‌ గఫర్‌, చలువాది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T04:25:07+05:30 IST