Advertisement
Advertisement
Abn logo
Advertisement

జనావాసాల నడుమ వైన్స ఏర్పాటు చేయొద్దు


ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిరసన తెలిపిన బీజేపీ నేత

మిర్యాలగూడటౌన, డి సెంబరు 3: జనావాసాల నడుమ వైన్స ఏ ర్పాటు చేయవద్ద ని డిమాం డ్‌ చేస్తూ ఓ బీజేపీ నేత ఒంటిపై కిరోసిన పోసుకొని నిరసన తెలిపారు. ఈ ఘటన మిర్యాలగూడ ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద చోటుచే సుకుంది. మిర్యాలగూడ పట్టణంలోని హనుమానపేట కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వైన్స దుకాణాన్ని మరో చోటుకు తరలించాలని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్యాం డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయానికి పార్టీ పట్టణ నాయకులతో కలిసి వెళ్లారు. తనవెంట తెచ్చుకున్న బాటిల్‌ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. పోలీసులు, అధికారు లు వారించి తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. అనంతరం శ్యామ్‌ విలేకరులతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేస్తున్న ఎక్సైజ్‌ సీఐకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడి, దేవాలయం, బీమా కార్యాలయానికి అతి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. నిత్యం రద్దీగా ఉంటే ఈ ప్రాంతంలో వైన్స ప్రారంభిస్తే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ఈ విషయాన్ని ఎస్పీకి, మిర్యాలగూడ మునిసిపల్‌ కమిషనర్‌కు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ శ్రీఽధర్‌ మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటు గిరి, పరంగి శ్యాం, మంద శివ, ప్రసాద్‌, ఉమాశంకర్‌, స్వామి, దశరధ పాల్గొన్నారు. 


Advertisement
Advertisement