మత్స్యకారుల సహనాన్ని పరీక్షించవద్దు

ABN , First Publish Date - 2022-01-24T06:32:36+05:30 IST

హెటెరో ఔషధ పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా వేసిన పైపులైన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలో రాజయ్యపేట తీరంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఆదివారం 54వ రోజుకి చేరుకుంది.

మత్స్యకారుల సహనాన్ని పరీక్షించవద్దు
రాజయ్యపేట తీరంలో మోకాళ్లపై నిలిచి ఆందోళన చేస్తున్న మత్స్యకారులు

 నక్కపల్లి, జనవరి 23 : హెటెరో ఔషధ పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా వేసిన పైపులైన్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మండలంలో రాజయ్యపేట తీరంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఆదివారం 54వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నాయకులు మాట్లాడుతూ మత్స్యకారుల సహనాన్ని చేతకానితనంగా చూడకూడదన్నారు. హెటెరో పరిశ్రమ వేసిన పైపులైన్‌ను పూర్తిస్థాయిలో వెంటనే తొలగించాలని, వ్యర్థ జాలాల కారణంగా మత్స్యకార గ్రామాల్లో వస్తున్న వ్యాధులపై సమగ్ర పరిశోధన జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్ర మత్స్యకార జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేరుగు కొర్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మత్స్యకార నాయకులు వాసిపిల్లి నూకరాజు, ప్రధాన కార్యదర్శి పిక్కి కోదండరావు, పిక్కి స్వామి, గోసల స్వామి, పెదకాపు తాతారావు, పిక్కి రమణ, దైలపల్లి శ్రీను, చోడిపల్లి కొండ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:32:36+05:30 IST