మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు : జేడీఏ

ABN , First Publish Date - 2020-08-13T11:04:36+05:30 IST

రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ అన్నారు

మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు : జేడీఏ

బోధన్‌రూరల్‌, ఆగస్టు 12 : రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ అన్నారు. బుధవారం బోధన్‌ మండలం అమ్దాపూర్‌, ఊట్‌పల్లి, బెల్లాల్‌, సాలూర గ్రామాల్లో వరిపంట పొలాలను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. వరిపంటలో పిలకలు తొడిగే దశ నుంచి దుబ్బకట్టే దశ వరకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అక్కడక్కడ వరి పంటకు బాక్టీరియా ఎండు ఆకు, పాముపొడ, తాటాకు తెగుళ్లు, కాండం తొలుచు పురుగు వ్యాపించిందన్నారు. శాస్త్రవేత్తల సూచనలు సలహాలు తీసుకోవా లన్నారు. ఆయన వెంట కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ బాలాజీ నాయ క్‌, శాస్త్రవేత్తలు రాజ్‌కుమార్‌, సురేష్‌, విజయ్‌కుమార్‌, ఏడీఏ సంతోష్‌, సర్పంచ్‌లు, వ్యవసాయశాఖ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-08-13T11:04:36+05:30 IST