మీ ఫోన్లో ఇవి వాడకండి!

ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST

స్మార్ట్‌ఫోన్లో వాడే ఆండ్రాయిడ్‌, కంప్యూటర్లో వాడే విండోస్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టంలు ఒకసారి ఒక

మీ ఫోన్లో    ఇవి వాడకండి!

హోమియో వైద్యంలో ‘‘ప్లేసిబో ఎఫెక్ట్‌’’ అని ఒకటుంటుంది. ఎలాంటి మందూ లేని ఖాళీ పిల్‌ ఇచ్చినా చాలా సార్లు మంచి ఫలితాలు ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ వాడే వారు కూడా చాలాసార్లు ఇలాంటి ప్రభావానికే గురవుతుంటారు. తమ ఫోన్లో ఖఅక ఆౌౌట్ట్ఛట  వంటి అప్లికేషన్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, వాటిలో ఉండే ఒక బటన్‌ ట్యాప్‌ చేసి.. ర్యామ్‌ మొత్తం ఖాళీ అయినట్లు ఎరుపు రంగు నుండి ఆకుపచ్చ రంగుకు స్ర్కీన్‌ మారగానే ఫోన్‌ చాలా వేగంగా మారిపోయినట్లు సంతోష పడుతూ ఉంటారు. వాస్తవానికి ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఇలాంటి ‘‘ర్యామ్‌ క్లీనింగ్‌ యాప్స్‌’’ వాడటం వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువ.




దీనికోసం ర్యామ్‌

స్మార్ట్‌ఫోన్లో వాడే ఆండ్రాయిడ్‌, కంప్యూటర్లో వాడే విండోస్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టంలు ఒకసారి ఒక అప్లికేషన్‌ ఓపెన్‌ చేసిన తర్వాత, దాన్ని తిరిగి క్లోజ్‌ చేసేటంత వరకూ ర్యామ్‌లో భద్రపరుస్తాయి. దీనివల్ల ఒక యాప్‌ నుండి మరో యాప్‌కి చాలా వేగంగా వెళ్లొచ్చు. అలా కాకుండా ఓపెన్‌ చేసి ఉన్న అప్లికేషన్‌ని పని పూర్తయిన తర్వాత ఎప్పటికప్పుడు క్లోజ్‌ చేస్తూ ఉంటే, తిరిగీ మళ్లీ అది అవసరమైనప్పుడు ఓపెన్‌ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. దీనికి ప్రధాన కారణం ఆ అప్లికేషన్‌కి సంబంధించిన ఫైళ్లను హార్డ్‌డిస్క్‌ లేదా ఫోన్లో ఉండే స్టోరేజ్‌ నుండి తిరిగి ర్యామ్‌లోకి లోడ్‌ చెయ్యడానికి అదనంగా సమయం పడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఓపెన్‌ చేసిన అప్లికేషన్లను క్లోజ్‌ చెయ్యడం మంచి పద్ధతి కాదు.


ఎందుకు క్లోజ్‌ చేస్తారు?

చాలా ఏళ్ళ నుంచి కంప్యూటర్లు, ఫోన్లు వాడుతున్న వారు కూడా చీటికి మాటికి తన ఓపెన్‌ చేసిన యాప్స్‌ని క్లోజ్‌ చేస్తుంటారు. అలాగే ఖఅకని క్లీన్‌ చేసే యాప్స్‌ని వాడి, ఫోన్‌ చాలా వేగం అయినట్లు అనుభూతి చెందుతుంటారు. వీరిని చూసి టెక్నాలజీ మీద అవగాహన లేని వారు కూడా ఇలాగే గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. ఇలా యాప్స్‌ని తరచూ క్లోజ్‌ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకప్పుడు కేవలం 1, 2జిబి, 3 జిబి ర్యామ్‌లు మాత్రమే ఉన్న ఫోన్లు ఉండేవి. కంప్యూటర్లో కూడా తక్కువ మొత్తంలో ర్యామ్‌ మాత్రమే ఉండేది. ఈ కారణంతో ఒకేసారి పలు యాప్స్‌ని ఓపెన్‌ చేస్తే ఇబ్బంది అవుతుందని భావించి చాలామంది ఎప్పటికప్పుడు ఓపెన్‌ చేసిన యాప్స్‌ క్లోజ్‌ చేస్తుంటారు.


ముఖ్యంగా విండోస్‌ కంప్యూటర్లో ర్యామ్‌ నిండిపోయిన తర్వాత హార్డ్‌డిస్క్‌లో ‘‘సి’’ డ్రైవ్‌లో ‘‘పేజ్‌ ఫైల్‌’’ అనే ఓ ప్రత్యేకమైన ఫైల్‌ సృష్టించబడి అది తాత్కాలికంగా ర్యామ్‌గా వాడబడుతుంది. అయితే అది హార్డ్‌ డిస్క్‌ కావటం వలన, ర్యామ్‌ కన్నా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి అది పెద్ద పని తీరు కలిగి ఉండదు. కాబట్టి మీ విండోస్‌ కంప్యూటర్లో తక్కువ ర్యామ్‌ ఉంటే అవసరం లేని యాప్స్‌ క్లోజ్‌ చెయ్యడం మంచిదే. అయితే ఇదే అలవాటు చాలామంది ఆండ్రాయిడ్‌ ఫోన్ల విషయంలోనూ అనుసరిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పు.




ఆండ్రాయిడ్‌లో ఇలా

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో మెమరీ నిర్వహణ భిన్నంగా జరుగుతుంది. ‘‘ర్యామ్‌ ఖాళీగా ఉంటే అది వృఽథా అయినట్లే’’ అనే విధానం ఆండ్రాయిడ్‌ విషయంలో అనుసరిస్తారు. అంటే సాధ్యమైనంతవరకు మీ ఫోన్లో ర్యామ్‌ నిండుతూనే ఉంటుంది. అలా నిండిపోవడం ఆందోళన చెందాల్సిన విషయం కాదు. సరిగ్గా ఇక్కడే చాలామంది ‘ఖఅక ఆౌౌట్ట్ఛట‘ వంటి యాప్స్‌ వాడే వారు పప్పులో కాలేస్తూ ఉంటారు. అలాంటి అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేయగానే, ‘‘మీ ఫోన్లో 90 శాతం ర్యామ్‌ నిండిపోయింది’’ అని అవి మెసేజ్‌ చూపిస్తే వీళ్లు ఆందోళన చెందుతారు.


100 శాతం ర్యామ్‌ నిండిపోయినా అది మంచి విషయమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. దీనికి ప్రధాన కారణం మీరు ఓపెన్‌ చేసే అన్ని అప్లికేషన్స్‌, చాలా వేగంగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండే విధంగా ర్యామ్‌లో అలాగే ఉంచబడతాయి. ఇలాంటి మీరు ఒక యాప్‌ నుండి మరో యాప్‌కి చిటికెలో మారిపోవచ్చు. ఉదాహరణకు మీరు ఫేస్‌బుక్‌లో న్యూస్‌ ఫీడ్‌ చూసి.. అంతలో వాట్సప్‌ నోటిఫికేషన్‌ ఏదైనా వస్తే అందులోకి వెళ్ళాలి అనుకుంటే.. అప్పటికే ఆ వాట్సప్‌ యాప్‌ ర్యామ్‌లోనే లోడ్‌ అయి ఉండటం వలన క్షణాల్లో అది తెరుచుకుంటుంది!




బూస్టర్లు వాడితే ఏంటి నష్టం?

ఒకవేళ ఫోన్‌ వేగంగా పనిచేస్తుందన్న భావనతో మీరు ‘ఖఅక ఆౌౌట్ట్ఛట‘, ‘ఖఅక ఇజ్ఛ్చూుఽ్ఛట‘ లాంటి ఏదైనా యాప్‌ వాడారనుకోండి. అప్పుడు అవి చేసే పని, అప్పటివరకు ర్యామ్‌లో లోడ్‌ అయి ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సప్‌, యూట్యూబ్‌ వంటి వివిధ అప్లికేషన్లను బలవంతంగా క్లోజ్‌ చేస్తాయి. అలా చేసిన తర్వాత స్ర్కీన్‌ మీద రెడ్‌ కలర్‌ నుండి గ్రిన్‌ కలర్‌కి మారిపోయి.. మీ ఫోన్‌ చాలా వేగం అయినట్లు మీకు తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి.


వాస్తవానికి ఇలా బలవంతంగా అప్లికేషన్లను క్లోజ్‌ చెయ్యడం వల్ల, ఫోన్‌ మరింత నెమ్మదిస్తుంది. ఇంతకు ముందు చూసిన ఉదాహరణనే చెప్పుకుందాం. మీరు ఫేస్‌బుక్‌ న్యూస్‌ఫీడ్‌ నుండి వాట్సప్‌కి రావాలి అనుకున్నప్పుడు, అప్పటికే వాట్సప్‌ క్లోజ్‌ చేయబడి ఉండటం వలన, దానికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్‌ అన్నీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుండి మళ్లీ ర్యామ్‌లోకి లోడ్‌ చెయ్యబడాల్సి ఉంటుంది. దీనికోసం కొంత ఆలస్యం జరుగుతుంది. అంతేకాదు.. ఇలా ఫైళ్లని మెమరీలోకి లోడ్‌ చేసే క్రమంలో బ్యాటరీ కూడా అదనంగా ఖర్చవుతుంది. అందుకే చీటికిమాటికి యాప్స్‌ క్లోజ్‌ చేసే వారి ఫోన్లలో బ్యాటరీ బ్యాక్‌అప్‌ కూడా తగ్గిపోతూ ఉంటుంది.


మనం క్లోజ్‌ చేయొచ్చా?

కొంతమంది ‘‘ర్యామ్‌ బూస్టర్‌’’ వంటి ప్రత్యేకమైన యాప్స్‌ వాడరు గానీ, వాటికి బదులుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లో ‘ఖ్ఛఛ్ఛిుఽ్ట‘ బటన్‌ ట్యాప్‌ చేసి, ఓపెన్‌ అయి ఉన్న అన్ని అప్లికేషన్లు ఒకదాని తర్వాత మరొకటి స్వైప్‌ చేసి తొలగిస్తుంటారు. ఇలా చేసినా కూడా సంబంధిత అప్లికేషన్‌ని బలవంతంగా క్లోజ్‌ చేసినట్లే! ఇంతకు ముందు చెప్పినట్లు మళ్లీ అదే అప్లికేషన్‌తో అవసరం పడినప్పుడు, అది మళ్ళీ పూర్తిగా లోడ్‌ చేయబడాలి కాబట్టి మెల్లగా ఓపెన్‌ అవుతుంది. చాలామందికి ఇలా ఓపెన్‌ అయి ఉన్న యాప్స్‌ని క్లోజ్‌ చెయ్యడం నియంత్రించుకోలేని ఓ చెడ్డ అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ అలవాటు మార్చుకోవాల్సిన అవసరం ఉంది.




ఓయస్‌ ఇలా కూడా చేస్తుంది!

మనం స్మార్ట్‌ఫోన్లలో వాడే ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో ఇంతకు ముందు చెప్పినట్లు మెమరీ నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుంది. మీ ఫోన్లో 6జిబి ర్యామ్‌ ఉంది అనుకోండి. ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, కాంటాక్ట్స్‌ లాంటి ఓ పది అప్లికేషన్స్‌ ఓపెన్‌ చేస్తే.. అవి ఒక్కొకటి 30 ఎంబీ, 50 ఎంబీ, 200 ఎంబీ.. ఇలా వివిధ పరిమాణాల్లో ర్యామ్‌లో స్థలాన్ని ఆక్రమించాయి అనుకోండి. ఇలా మీకు ఉన్న 6జిబికి ఒకేసారి ఎంత లేదన్నా 30-50 యాప్స్‌ వరకూ నిక్షేపంగా ఓపెన్‌ చేసి ఉంచొచ్చు.


గంట క్రితం అన్నిటికంటే ముందు ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసారు అనుకోండి. ఈ గంటలో మళ్లీ ఫేస్‌బుక్‌ జోలికి వెళ్లలేదు అనుకుంటే.. 6 జిబి ర్యామ్‌ నిండిపోయే వరకూ ఫేస్‌బుక్‌ క్లోజ్‌ చెయ్యబడదు. ఒకవేళ మీరు అనేక యాప్స్‌ ఓపెన్‌ చేయడం వల్ల 6 జిబి నిండిపోతే.. అప్పుడు మరో కొత్త అప్లికేషన్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు మాత్రమే... అన్నిటికంటే మొట్టమొదట లోడ్‌ చెయ్యబడి, ఇప్పటి వరకూ మళ్లీ వాడని ఫేస్‌బుక్‌ యాప్‌ మెమరీ నుండి క్లోజ్‌ అవుతుంది. అంత అవసరం పడనంత వరకు అది ర్యామ్‌లో అలా కొనసాగుతూనే ఉంటుంది. అంతేకాదు, చాలా సమయం పాటు ఓపెన్‌ చేయని యాప్స్‌ని ర్యామ్‌లో వెనక్కి నెట్టి, తరచూ ఓపెన్‌ చేసే యాప్స్‌ వేగంగా లోడ్‌ అయ్యే విధంగా కూడా ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం ప్రాధాన్యత ఇస్తుంది.


వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ నెట్‌ స్పీడ్‌ ఇది

సెకెన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ లైబ్రరీ డౌన్‌లోడ్‌


వేగం... ఏదైనా తొందరగా జరగాలి... టచ్‌ చేయగానే డేటా ప్రత్యక్షం కావాలి. క్లిక్‌ కొట్టగానే అంతే వేగంతో గమ్యస్థానం చేరుకోవాలి. సరిగ్గా అదే అంటే... ఇంటర్నెట్‌ డేటా ట్రాన్స్‌మిషన్‌ రేట్‌లో అత్యంత వేగాన్ని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు సాధించారు. ఎంత వేగం అంటే నెట్‌ఫ్లిక్స్‌ లైబ్రరీ యావత్తూ సెకెను వ్యవధిలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెకెనుకు 178 టెరాబైట్స్‌ మేర డేటా ట్రాన్స్‌మిషన్‌ రేటును సాధించారు. ఇంతకుమునుపు రికార్డుతో పోల్చుకుంటే ఇది అయిదు రెట్లు ఎక్కువ. ‘ఐఇఇఇ ఫోనెటిక్స్‌ టెక్నాలజీ లెటర్స్‌’ జర్నల్‌ లో ఈ మేరకు పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఎక్సెట్రా, కెడిడిఐ రీసెర్చ్‌ అనే రెండు కంపెనీలతో కలిసి వీరంతా పని చేశారు. 




అందుకే ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడే వారు ఫోన్‌ వేగం అవ్వాలని కనిపించిన ప్రతీ యాప్‌ వాడకండి.. దానివలన ఫోన్‌ పనితీరు మరింత మందగిస్తుంది. మీరేమీ చేయాల్సిన పని లేకుండానే ఫోన్‌ని వేగంగా పని చేయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ఆండ్రాయిడ్‌ అంతర్గతంగా కలిగిఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా మీరు ఫోన్‌ వాడుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ నెమ్మదిగా ఉంటే అది తగినంత స్టోరేజ్‌ స్థలం లేకపోవడం, లేదా మాల్వేర్‌ ఉండడం తప్పించి వేరే ఏ సమస్యా ఉండదు.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST