చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అతిక్రమించొద్దు

ABN , First Publish Date - 2021-11-29T06:24:34+05:30 IST

చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని మరమగ్గాల యజమానులు అతిక్రమించరాదని తిరుపతి చేనేత జౌళిశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉపసంచాలకుడు వి.భీమయ్య స్పష్టం చేశారు.

చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అతిక్రమించొద్దు
చేనేత అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న డీడీ భీమయ్య

మదనపల్లె అర్బన్‌, నవంబరు 28: చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని మరమగ్గాల యజమానులు అతిక్రమించరాదని తిరుపతి చేనేత జౌళిశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉపసంచాలకుడు వి.భీమయ్య స్పష్టం చేశారు. ఆదివారం నీరుగట్టువారిపల్లెలో ఉన్న చౌడేశ్వరీదేవి కలాళ్యాణమండపంలో చేనేత రిజర్వేషన్‌ చట్టం 1985పై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు మరమగ్గాల యజమానులు, చేనేత మగ్గాల నిర్వాహకులు హాజరయ్యారు. ఈసందర్భంగా  భీమయ్య మాట్లాడుతూ... మరమగ్గాల్లో 45శాతం పట్టుదారం, 55 శాతం పాలిస్టర్‌ కలిపి వస్త్రాలను తయారు చేయాలన్నారు. 100శాతం పట్టుదారంతో మరమగ్గాలపై నేయరాదన్నారు. చేనేత జౌళిశాఖ ఏడీ రమేష్‌, ఏడీవోలు శ్రీనివాసులు, చౌడేశ్వరీ పవర్‌లూమ్స్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు శివయ్య, మోడెం శిద్దప్ప, కౌన్సిలర్‌ మందపల్లె వెంకటరమణ, శీలం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-11-29T06:24:34+05:30 IST