వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు

ABN , First Publish Date - 2021-06-14T06:02:05+05:30 IST

కరోనా వ్యాక్సిన్లపై ఎలాంటి అపోహలు వద్దని, అందరు టీకా వే సుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి సూచించారు.

వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

- పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ చాడల తిరుపతి

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 13: కరోనా వ్యాక్సిన్లపై ఎలాంటి అపోహలు వద్దని, అందరు టీకా వే సుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి సూచించారు. స్థానిక అమర్‌చంద్‌ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన వ్యాక్సినే షన్‌ను పరిశీలించన అనంతరం ఆయన మా ట్లాడారు. వ్యాక్సినేషన్‌ పక్రియ సోమవారంతో ముగియనుందన్నారు. ఇప్పటివరకు 18 ఏళ్ళు పైబడిన వ్యాపార, వాణిజ్య, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే కార్మికులు వాటి నిర్వాహకులకు రిజి స్ర్టేషన్‌ చేసి వ్యాక్సిన్‌ వేశామన్నారు. మొత్తం 5,120 మందికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు పే ర్కొ న్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరింత పొడిగించే అవకాశాలున్నట్లు తెలిపారు. వ్యాక్సి న్‌ రెండు డోసులు వేసుకున్న వారు సైతం డ బుల్‌ మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించా లని సూచించారు. వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి క రోనా వలకల ప్రాణాపాయం ఉండదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద కొవిడ్‌ నిబం ధనలు పాటించే విధంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శివప్ర సాద్‌, అనీల్‌, రాజు ఇతర సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-06-14T06:02:05+05:30 IST