Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబర్‌, 7: ప్రజలు వ్యాక్సినేషన్‌పై ఉన్న అపోహలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి టీకాను వెయాలని సిబ్బం దికి ఆర్డీవో వినోద్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దాపూర్‌, చౌలమద్ది, కొండ్రికర్ల, ఆత్మకూర్‌ గ్రామాల్లో వైద్యసిబ్బంది వే స్తున్న వ్యాక్సీనేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు వీదుల్లో పర్యటించి గ్రామస్తులు వ్యాక్సిన్‌ వేసుకోని వా రికి అవగాహన కల్పించి తప్పనిసరిగా వేసుకోవాలని ఆరోగ్యంగా ఉండా లన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, ఇంటింటికి వెళ్లి వ్యా క్సీనేషన్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తూ అవగాహన కల్పించాలని పం చాయతీ పాలకవర్గ సభ్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అ దే విధంగా మండలంలో చౌలమద్దిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప రిశీలించి విక్రయించడానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు కల్గకుండా ధా న్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేస్తూ మిల్లర్లకు తరలించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గడ్డం లింగారెడ్డి, కోరెపు రవి, ఆ కుల రాజగంగు, చౌట్‌పల్లి లావణ్య-అంజయ్య, ఉప సర్పంచ్‌ నేరెళ్ల శ్రీ ధర్‌, ఎంపీడీవో భీమేశ్‌రెడ్డి, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, మండల వైధ్యాధి కారి నరేందర్‌, కార్యదర్శులు, పాల్గొన్నారు. 

Advertisement
Advertisement