తెల్లని బ్రెడ్‌ వద్దే వద్దు

ABN , First Publish Date - 2021-07-06T06:16:10+05:30 IST

ఎక్కువ శాతం ఇళ్లలో వైట్‌ బ్రెడ్‌ ఉదయం అల్పాహారంగా ఉంటూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది ఇష్టంగా తినే వైట్‌ బ్రెడ్‌లో పోషకాలు తక్కువ, హానికారకాలు ఎక్కువగా ఉంటాయి.

తెల్లని బ్రెడ్‌ వద్దే వద్దు

క్కువ శాతం ఇళ్లలో వైట్‌ బ్రెడ్‌ ఉదయం అల్పాహారంగా ఉంటూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది ఇష్టంగా తినే వైట్‌ బ్రెడ్‌లో పోషకాలు తక్కువ, హానికారకాలు ఎక్కువగా ఉంటాయి. 


వైట్‌ బ్రెడ్‌ తయారీ విధానంలో గోధుమ పిండిని వేర్వేరు రసాయనాలతో బ్రీచ్‌ చేసి, తెల్లని పిండిగా మారుస్తారు. బెంజాయిల్‌ పెరాక్సైడ్‌, క్లోరీన్‌ డయాక్సైడ్‌, పొటాషియం బ్రోమేట్‌, రిఫైన్డ్‌ స్టార్చ్‌లను జోడించి గోధుమ పిండిని తెల్లగా మార్చడం జరుగుతుంది. ఈ రసాయనాలను తక్కువ పరిమాణంలో వాడడం వల్ల ఆరోగ్య నష్టం జరగకపోయినా, ఎక్కువగా వైట్‌ బ్రెడ్‌ తినడం వల్ల రసాయనాల పరిమాణం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాగే వైట్‌ బ్రెడ్‌ ద్వారా అందే క్యాలరీల శాతం కూడా ఎక్కువే!  ఒక స్లైస్‌ వైట్‌ బ్రెడ్‌లో 77 క్యాలరీలు ఉంటాయి. 


మధుమేహం: అత్యధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ మూలంగా తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్‌ వేగంగా విడుదలై చక్కెర స్థాయి త్వరితంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మధుమేహులు వైట్‌ బ్రెడ్‌కు దూరంగా ఉండడం మేలు. 


అధిక బరువు: శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే వైట్‌ బ్రెడ్‌ తినడం మానేయాలి. దీన్ని తినడంతో రక్తంలో త్వరితంగా పెరిగే చక్కెరను శరీరం అంతే వేగంగా వినియోగించుకోలేదు. దాంతో అదనపు గ్లూకోజ్‌ కొవ్వుగా మారి, ఊబకాయానికి దారి తీస్తుంది. రక్తంలో అధిక చక్కెర తీపి తినాలనే కోరికను పెంచుతుంది. దాంతో తీపి పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయులుగా మారతారు.

Updated Date - 2021-07-06T06:16:10+05:30 IST