Abn logo
Sep 19 2021 @ 23:01PM

ఊపిరి ఉన్నంత వరకూ ప్రజాసేవ చేస్తా

పటాన్‌చెరులో ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతున్న అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారికవిజయ్‌కుమార్‌

నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని మరిచిపోలేను 

ఘనంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు

పటాన్‌చెరు, సెప్టెంబరు 19 : ఊపిరి ఉన్నంత వరకూ పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దఎత్తున అభిమానులు పటాన్‌చెరులోని ఆయన నివాసానికి తరలిరావడంతో జనాలతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం ప్రజాసేవ చేసేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రెండుసార్లు నిండు మనసుతో ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన నియోజకవర్గం ప్రజలకు జీవితం మొత్తం రుణపడి ఉన్నానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ భూపాల్‌రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిదని తెలిపారు. రాష్ట్రంలోనే పటాన్‌చెరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఇస్తున్న ప్రోత్సాహమే తన బలమని చెప్పారు. గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్ల కాలంలో చేసినందుకు సంతృప్తి ఉన్నదన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని పేర్కొన్నారు. పట్టణంలోని పాలు ఆలయాలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ చేపట్టిన గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కింద 11 మంది వికలాంగులకు త్రిచక్ర వాహనాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్‌చెరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారికవిజయ్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, జడ్పీటీసీలు సుప్రజవెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీలు ఈగ సుష్మ, సద్ది ప్రవీణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు రోజాబాల్‌రెడ్డి, లలితాసోమిరెడ్డి, కార్పొరేటర్లు పుష్పనగేష్‌, సింధూఆదర్శరెడ్డి, నాయకులు వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. 

జిన్నారం మండలంలో

జిన్నారం, సెప్టెంబరు 19 : ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మండల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆదివారం బొల్లారంలో వినాయక మండపం వద్ద అన్నదానంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేను మున్సిపల్‌ కౌన్సిలర్‌ చంద్రారెడ్డి, హన్మంతరెడ్డి, టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భారీ గజమాలను వేసి ప్రత్యేక వాహనంపై పట్టణంలో మహిపాల్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచులు సత్యనారాయణ, సరితాసురేందర్‌గౌడ్‌, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసం వద్ద కలిసి సన్మానించారు.

రామచంద్రాపురం మండలంలో

రామచంద్రాపురం, సెప్టెంబరు 19 : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని ఆదివారం రామచంద్రాపురం, తెల్లాపూర్‌లో ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చేత కేక్‌ కట్‌ చేయించి, సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఐజీలో క్యాన్సర్‌ రోగికి చికిత్స నిమిత్తం తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెపల్లి లలితాసోమిరెడ్డి రూ.50 వేలను అందించారు. టీఆర్‌ఎ్‌సవీ నియోజకవర్గ అధ్యక్షుడు కమ్మెట చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహా గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించి, మున్సిపల్‌ సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. వైస్‌ చైర్మన్‌ బి.రాములుగౌడ్‌, కౌన్సిలర్లు కమ్మెట జ్యోతిశ్రీకాంత్‌రెడ్డి, ఒగ్గు సుచరితకొమురయ్య, పట్లోళ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ 16, 17వ వార్డు నూతన అధ్యక్షుడు సి.సత్యనారాయణ, ఆశంగారి యాదగిరి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రామచంద్రాపురం పట్టణంలో అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్‌, షేక్‌ అబ్దుల్‌ ఖదీర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేత కేక్‌ కట్‌  చేయించిన కార్పొరేటర్లు వి.సింధూఆదర్శరెడ్డి, బి.పుష్పనగే్‌షయాదవ్‌ ఎమ్మెల్యేను పూలమాలలతో సత్కరించారు.