Abn logo
Mar 3 2021 @ 04:43AM

సినిమాలకూ రిహార్సిల్స్‌ చేస్తే?

‘‘స్టేజ్‌ షోల కోసం రిహార్సిల్స్‌ చేస్తాం. నాకు అదెంత ఇష్టమో! సినిమాలకూ అలా రిహార్సిల్స్‌ చేస్తే?! ఎంత బ్రిలియెంట్‌ సినిమా వస్తుందో ఊహించండి. కానీ, ఎవరూ చేయరు. రాబోయే సినిమాల కోసం నటీనటులు రిహార్సిల్స్‌ చేయాలని నేను కోరుకుంటున్నా’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారీ హైదరాబాదీ! ఈ నెల 11న ఆ చిత్రం విడుదల కానుంది. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ‘‘నాకు చిన్నతనం నుంచి లలితకళలు అంటే ఆసక్తి. డ్యాన్సర్‌ కావాలనుకున్నా. మోడల్‌గా చేశా. దాదాపు 50 స్టేజ్‌ షోల్లో నటించా. ‘నక్షత్ర’ వెబ్‌ సిరీస్‌లో నటించా. మా లయోలా కాలేజీలో ఓ వేడుకకు నాగ్‌ అశ్విన్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పరిచయమైంది. నా ఆసక్తి గురించి చెప్పా. ఆడిషన్‌కి పిలిచారు. ‘జాతి రత్నాలు’లో అవకాశం వచ్చింది. నవీన్‌ పోలిశెట్టికి జోడీగా చిట్టి పాత్రలో నటించా. ఈ చిత్రం కోసమే నేను తెలుగు నేర్చుకున్నా. ‘జాతిరత్నాలు’ సమాజంపై ఓ సెటైర్‌ అని చెప్పవచ్చు. మనమంతా తెలివైనోళ్లమని అనుకుంటాం. కానీ, మనలో అమాయకత్వాన్ని చూపిస్తుందీ చిత్రం’’ అన్నారు. తనకు ఇష్టమైన నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ అనీ, విజయ్‌ దేవరకొండతో నటించాల నుందనీ ఫరియా తెలిపారు. తాను ఎత్తుగా ఉండటం తన సమస్య కాదన్నారు.

Advertisement
Advertisement
Advertisement