Abn logo
Sep 22 2021 @ 22:15PM

భారత్‌బంద్‌ను విజయవంతం చేయండి

వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్న రైతుకార్మిక సంఘాల నాయకులు

గూడూరు, సెప్టెంబరు 22:  ఈనెల 27న భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ తీసుకువచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాలన్నారు. పది నెలులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు పోరాడుతన్నా నరేంద్రమోదీ పట్టించుకోవడంలేదన్నారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలన్నారు. కార్యక్రమంలో జోగి శివకుమార్‌, యాదగిరి, బాబురావు, కాలేషా, బాలరాజు, బీవీ రమణయ్య, చంద్రయ్య, మధు, ముత్యాలయ్య తదితరులు పాల్గొన్నారు.