ఇంట్లో ఇలా చేయండి!

ABN , First Publish Date - 2020-05-17T07:22:39+05:30 IST

భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు కొవిడ్‌-19 వ్యాప్తిని ధైర్యంతో ఎదుర్కొంటున్నాయి.

ఇంట్లో ఇలా చేయండి!

భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాలు కొవిడ్‌-19 వ్యాప్తిని ధైర్యంతో ఎదుర్కొంటున్నాయి. మీరు కూడా ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కరోనాతో పోరాటం చేస్తున్నారు కదా! ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి బోర్‌ కొట్టకుండా ఉండేందుకు ఇలా చేయండి...

 

రోగ నిరోధక శక్తిని పెరగడానికి మంచి ఆహారం తీసుకోండి. రోజూ ఉదయం ఎండలో కాసేపు వ్యాయామం, ధ్యానం చేయండి.

యూట్యూబ్‌లో నైతిక విలువలను పెంపొందించే పంచతంత్ర కథల లాంటివి వినండి. దానివల్ల భాషా నైపుణ్యం పెరుగుతుంది.

రోజూ కాసేపు పాఠ్యపుస్తకాలు చదవండి. వర్క్‌ షీట్లు పూర్తి చేయండి. చదివితే సరిపోదు, రాయడం కూడా ప్రాక్టీస్‌ చేయాలి. 

డ్రాయింగ్‌, పెయింటింగ్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, డ్యాన్స్‌, మిమిక్రీ వంటి అంశాలలో మీకు ఏది ఇష్టమైతే దాన్ని నేర్చుకోండి. 

ఇంటి పనుల్లో మమ్మీకి సహాయపడండి. ఇల్లు శుభ్రం చేయడం, తుడవడం, బెడ్‌షీట్స్‌ మడతపెట్టడం, మొక్కలకు నీళ్లు పోయడం లాంటి పనులు చేయడం మరువద్దు. 

గొప్ప వ్యక్తుల ఆత్మకథలు చదవండి. వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలు, వారి జీవన విఽధానాలను నెట్‌లో చూడండి. 

భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను, డాక్యుమెంటరీ చిత్రాలనూ ఖాళీ సమయాల్లో చూడండి.

ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం గురించి తెలుసుకోండి. లాక్‌డౌన్‌ ప్రభావం వాటిపై ఎలా ఉంటుందో పత్రికల్లో చదవండి.

వ్యక్తిగత శుభ్రతపై అవగాహన పెంచుకోండి. తరచుగా చేతులను శుభ్రం చేసుకోండి. మాస్క్‌ ధరించండి. భౌతిక దూరం పాటించండి.

ఆన్‌లైన్‌ పాఠాల కోసం e-pathashala, khan academy, national digital library, T- SAT వంటి యాప్‌లు చూడండి.


డాక్టర్‌ పాక వెంకటేశ్వర్లు

సెక్రటరీ - కరస్పాండెంట్‌

వివేకానంద స్కూల్‌, నక్కలగుట్ట, హన్మకొండ.

Updated Date - 2020-05-17T07:22:39+05:30 IST