మాకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-01-18T04:08:21+05:30 IST

నమ్మించి మోసం చేశారు.. మాకు న్యాయం చేయాలని లబ్ధిదారులు సో మవారం వినతిపత్రాలు అందజేశారు.

మాకు న్యాయం చేయండి
బాధితులతో కలిసి ఎంపీడీవో శర్మకు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు

గృహ లబ్ధిదారుల ఆవేదన 

ఇల్లు మంజూరయ్యాకే 

అప్పుచేసి బేస్‌మెంట్‌ నిర్మాణం

మీ పేరు లేదని అధికారులు 

చెప్పడంతో ఆందోళన

అధికారులకు వినతి 

పెద్ద దోర్నాల, జనవరి 17 : నమ్మించి మోసం చేశారు.. మాకు న్యాయం చేయాలని లబ్ధిదారులు సో మవారం వినతిపత్రాలు అందజేశారు. వివరాల్లోకి వె ళితే.. కొన్నాళ్లుగా కొండ ప్రాంతం బాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న తమ భూమిని ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాం. ఈ క్రమంలో త మకు ఇంటి స్థలాన్ని కూడా అక్కడ కేటాయించారు. జగనన్న గృహాన్ని కూడా మంజూరు చేశారు. ఇంటిని నిర్మించుకోవాలని అధికారులు ఇంటి పట్టా ఇచ్చారు. ఆ భరోసాతో అప్పోసప్పో చేసి రూ.40 వేలతో బేస్‌ మెంట్‌ కూడా వేసుకున్నాం. బిల్లు పెట్టమంటే హౌసింగ్‌ అధికారులు మీకు గృహం మంజూరు కాలేదని, బిల్లులు పెట్టడమేంటని ప్రశ్నించడంపై మం డలంలోని యడవల్లి గ్రామానికి చెందిన  లబ్ధిదారులు బోగోలు రంగమ్మ, భర్త చిన్న మద్దయ్య వాపోతున్నారు. ప్రభుత్వం ఉచితంగా పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి లే అవుట్లు వేసి పక్కా గృహాలు నిర్మించి మహిళలకు కానుకగా  ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేప థ్యంలో యడవల్లి గ్రామం పేదలకు గ్రామం సమీపంలోని శ్రీ తిరుమలథ స్వామి దేవాలయం వద్ద కొండ ప్రాంతంలో రెవెన్యూ భూమి ఉంది. అక్కడ ప్రభుత్వం యడవల్లి, గంటవానిపల్లె ప్రజలకు  ఇంటి స్థలాలు మం జూరు చేసింది. ఆ స్థలాల్లో యడవల్లికి చెందిన బోగోలు రంగమ్మకు కూడా ఇంటి పట్టాను అధికారులు అందజేశారు. పక్కా గృహం కూడా మంజూరైంది. బేస్‌మెంట్‌ నిర్మిస్తే బిల్లు పెడతామని, మీ బ్యాంకు ఖాతాలోకి రూ.40వేలు జమ చేస్తామని అధికారులు చెప్పారు. అది నమ్మిన లబ్ధిదారులు సుమారు రూ.40,000 ఖర్చుచేసి బేస్‌మెంట్‌ నిర్మిం చారు. ఆ బిల్లు చేయమని హౌసింగ్‌ అధికారులను అడిగితే అసలు ఇల్లే  మీకు మంజూరు కాలేదని చెప్పడంతో కంగుతిన్నారు. బిల్లు ఎక్కడ నుంచి వస్తాయని లబ్ధిదారులకు చెప్పడంతో ఆందోళన చెందు తున్నారు. 

దీంతో గ్రామానికి చెందిన టీడీపీ మండల కన్వీనర్‌ ఏర్వ మల్లికార్జున రెడ్డి పలువురు టీడీపీ నా యకులు లబ్ధిదారులకు అండగా నిలిచారు. ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఎంపీడీవోకు సమస్యను తెలిపి, వినతిపత్రం సమర్పించారు.  ఎంపీడీవో ప్రభాకర్‌ శర్మ హౌసింగ్‌ ఏఈ శ్రీనివాస్‌కు ఫోన్‌లో అడిగారు. ఆమె పేరు లబ్ధిదారుల జాబితాలో లేదని తెలిపారు. అనంతరం ఎంపీడీవో ప్రభాకర్‌ శర్మ మాట్లాడుతూ న్యాయం చేస్తామని ఆమెకు ధైర్యం చెప్పారు.  అ నంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందజేశారు.  

నమ్మించి మోసం చేశారు

ఇంటి స్థలాల కోసం తాము సాగు చేసు కుంటున్న భూమిని ఇచ్చాం. అధికారుల మాటలు నమ్మి  రూ.40 వేలు అప్పు చేసి బేస్‌మెంట్‌ వేశాం. ఇప్పుడేమో ఇల్లు శాంక్షన్‌ కాలేదని అధికారులు చెప్తున్నారు. మాకు నలుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలున్నారు.  నమ్మించి మోసం చేశారు. మాకు న్యాయం చేయాలి. 

రంగమ్మ, భర్త చిన్న మద్దయ్య 





Updated Date - 2022-01-18T04:08:21+05:30 IST