Abn logo
Jun 14 2021 @ 01:13AM

అర్హత ఉన్నా.. అందని ‘చేయూత’

వజ్రకరూరు, జూన 13: మండలంలోని ఛా యాపురం గ్రామంలో అర్హత ఉన్నా ‘చేయూత’ పథకం అందకుండా స్థానిక రాజకీయ నాయకు లు అడ్డుపడుతున్నారు. చిరు వ్యాపారులకు అం డగా నిలవడానికి ప్రభుత్వం జగనన్న చేయూత పథకం కింద రూ.10 వేల రుణ సహాయాన్ని అం దిస్తోంది. అందులో భాగంగానే గ్రామానికి చెంది న ఆదెక్క, జానమ్మ చేయూతకు దరఖాస్తును వ లంటీర్‌ మధుకు అందజేశారు. ఆయన స్థానిక వైసీపీ నాయకుల వద్దకు వెళ్లాలని వారికి సూ చించారు. వైసీపీ నాయకులు ఆదేసిస్తేనే పథకానికి దరఖాస్తు చేస్తానన్నారు. అంతేకాకుండా గ్రామంలోని సురేష్‌కు చెందిన వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చించివేశారన్నారు. ఒకవైపు ప్రభుత్వం పార్టీలకతీతంగా పథకాలను అందించాలని చెబుతుంటే.. ఇక్కడ మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.