ఓరి నాయనో.. వీడేంట్రా.. కొండచిలువను పక్కలో పెట్టుకుని ఇలా చేస్తున్నాడు..!

ABN , First Publish Date - 2021-11-12T02:05:44+05:30 IST

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ భారీ కొండచిలువ ఇంట్లోకి వెళ్లింది. లోపల సోఫాలో ఓ బాలుడు పడుకుని ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. కొండచిలువ చిన్నగా సోఫా పైకి ఎగబాకుతోంది. ఆ పరిస్థితుల్లో

ఓరి నాయనో.. వీడేంట్రా.. కొండచిలువను పక్కలో పెట్టుకుని ఇలా చేస్తున్నాడు..!

కొండచిలువ వరకు ఎందుకు.. పాము పిల్లను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. విష సర్పాలను చూస్తేనే ఒళ్ళంతా జలదరించి, కంపనం పుడుతుంది. ఇది మనకి తెలీకుండానే అసంకల్పితంగా జరిగిపోతుంటుంది. వాటితో సావాసం అనే మాట.. కలలో కూడా అంగీకరించం. విష సర్పాలు కావడంతో సాధారణంగానే మనుషులకు భయం ఉంటుంది. అవి కనబడితే పారిపోవడమో, లేక చంపడమో చేస్తుంటారు. మనం వాటికి హాని చేయకపోతే.. అవి మన జోలికి రావు అనే విషయం తెలిసినా భయం మాత్రం ఉంటుంది. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా కొండచిలువ పక్కన ఉన్నా.. తాపీగా ఉన్నాడు.


ఇప్పటి పిల్లలు వీడియో గేమ్‌లకు ఎంత ఎడిక్ట్ అయ్యారో అందరికీ తెలుసు. ఫోన్ చేతిలో ఉంటే బయటి ప్రపంచాన్నే మర్చిపోతారు. పక్కనున్న వ్యక్తులను కూడా పట్టించుకోకుండా అందులోనే మునిగిపోతుంటారు. పక్కన వ్యక్తులను పట్టించుకోకున్నా సమస్య లేదు గానీ .. పక్కన జరిగే ప్రమాదాలను కూడా గుర్తించలేనంత లీనమైపోతుంటారు. ఇక్కడ మనం చూడబోయే వీడియోలో ఓ బాలుడు గేమ్ ఆడుతున్నాడు. ఇందులో విశేషం లేదుగానీ.. పక్కన భారీ కొండచిలువ ఉన్నా, పట్టించుకోకుండా గేమ్‌లో లీనమయ్యాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ భారీ కొండచిలువ ఇంట్లోకి వెళ్లింది. లోపల సోఫాలో ఓ బాలుడు పడుకుని ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. కొండచిలువ చిన్నగా సోఫా పైకి ఎగబాకుతోంది. ఆ పరిస్థితుల్లో వేరే వాళ్లు ఉంటే.. ఫోన్ విసిరికొట్టి కాళ్లకు బుద్ధి చెబుతారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం కొండచిలువకు ఏమాత్రం భయపడలేదు. నువ్వూ రా.. కలిసి గేమ్ ఆడుకుందాం.. అన్నట్లుగా, ఏకంగా దాని మీదే తలపెట్టి గేమ్ ఆడుతున్నాడు. కొండచిలువ ఎన్ని మెలికలు తిరుగుతున్నా చలించలేదు. గేమ్ మధ్యలో ఆపే సమస్యే లేదు అనే దీమాలోనే ఉన్నాడు. చివరికి ఆ కొండచిలువ కూడా బాలుడితో రాజీ పడి సైలెంట్‌గా ఉండిపోయింది. ఈ వీడియో ఎంతవరకు నిజమో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.



Updated Date - 2021-11-12T02:05:44+05:30 IST