Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేద్కర్‌కు ఘన నివాళి

ఉదయగిరి, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు బకీరు జాషువా, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు తాజుద్ధీన్‌, సత్తెనపల్లి శ్రీరాములు, ఫడ్స్‌ రమణయ్య, దస్తగిరిఆహ్మద్‌, కాకు వెంకటయ్య, బాలయ్య, మరియదాస్‌ ,బాలగురవయ్య తదితరులు పాల్గొన్నారు.

కావలి రూరల్‌ : కావలి ఎమ్పీడీవో కార్యాలయంలో అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆలూరు కొండమ్మ, ఎమ్పీడీవో సుబ్బారావులు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈవోపీఆర్డీ ఆదినారియణ, ఏవో శ్రీధర్‌, కార్యాలయ సిబ్బంది శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. 

కావలిటౌన్‌ : బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆయనకు ఘననివాళులు అర్పించారు. ట్రంకురోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్‌, నేతలు జ్యోతి బాబురావు, ఏగూరి చంద్రశేఖర్‌, కుందుర్తి కిరణ్‌, దేవ, సూరి, టీ వాసు, కర్నాటి సుబ్బారావు, భాస్కర్‌, శివాజి, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు కె బ్రహ్మానందం, నేతలు సీవీసీ సత్యం, వీ సుధీర్‌, బాలు యాదవ్‌, కామినేని ఉదయలక్ష్మి, మంద కిరణ్‌, తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పట్టణ కమిటీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నేతలు గంధం ప్రసన్న, పందిటి కామరాజు, పరుసు మాల్యాద్రి, తిరివీధి ప్రసాద్‌, కొమారి రాజు, ఇర్మియా ప్రభాకర్‌, పద్మ, నాగాచారి, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నేతలు దామా అంకయ్య, డేగా సత్యం, చేవూరు కొండయ్యలు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీపీఎం నేతలు పి పెంచలయ్య, మల్లికార్జునరావు, కృష్ణమోహన్‌ తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అ్పంచారు. కావలి బార్‌ అసోసియేషన్‌లో కార్యాయలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి పాండురంగారెడ్డి, స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ పరుశురామ్‌, సీనియర్‌ న్యాయవాదులు కలికి శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, గద్దె మాల్యాద్రి, బాలాజీ, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ బాధ్యులు రవిప్రకాష్‌, గంధం ప్రసన్న, లోకేశ్వర్‌ రెడ్డి, పార్వతీ శంకర్‌, బీద లక్ష్మీనంద తదితరులు పాల్గొని అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌. మల్లి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కావలి రూరల్‌ : అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎంపీపీ, అధికారులు


ఉదయగిరి : అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు


Advertisement
Advertisement