Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ యువకుడు.. వైద్యులు పరీక్షించి చనిపోయాడంటూ తేల్చేశారు.. మార్చురీకి తరలించిన తర్వాత సడన్‌గా..

ఇంటర్నెట్ డెస్క్: కొంచెం పని ఉంది.. ఇప్పుడే వచ్చేస్తా అంటూ ఇంట్లో చెప్పి, ఓ యువకుడు బైక్‌పై బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి యాక్సిడెంట్ అయింది. దీంతో స్థానికులు ఆ యువకుడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు.. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యులు ఆ యువకుడిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో.. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు.. యువకుడు చనిపోయాడంటూ తేల్చేశారు. డెడ్‌ బాడీని మార్చురీకి కూడా తరలించారు. ఈ క్రమంలో అక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకూ ఏం జరిగింది అంటే.. 


ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన శ్రీకేష్.. కొంచెం పని ఉందని ఇంట్లో చెప్పి, రాత్రి బైక్‌పై బయటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడికి యాక్సిడెంట్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ శ్రీకేష్‌ను పరీక్షించిన వైద్యులు.. అతడిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని చెప్పడంతో.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులు పరీక్షించి.. శ్రీకేష్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో డెడ్ బాడీని ఆసుపత్రి సిబ్బంది.. మార్చురీలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా శ్రీకేష్.. ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు. 


ఈ విషయం తెలియడంతో ఆసుపత్రిలోని వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం అతడిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లి.. చికిత్స చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించారు. తొలుత వైద్యులు చేసిన ప్రకటనలో ఎటువంటి తప్పు లేదన్నారు. శ్రీకేష్‌ను పరీక్షించిన తర్వాతే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని వెల్లడించారు. అయితే.. ఇటువంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయని.. చనిపోయారు అనుకున్న వ్యక్తులు సడన్‌గా ఊపిరి తీసుకోవడం అరుదుగా జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీకేష్ విషయంలో కూడా ఇదే జరిగిందని వివరించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement