వైద్యా రంగంలో డాక్టర్ బేరమ్మ విపవాత్మక మార్పులు తెచ్చారు: డా.జగదీష్

ABN , First Publish Date - 2021-10-04T01:05:17+05:30 IST

వైద్యా రంగంలో డాక్టర్ బేరమ్మ విపవాత్మక మార్పులు తెచ్చారు: డా.జగదీష్

వైద్యా రంగంలో డాక్టర్ బేరమ్మ విపవాత్మక మార్పులు తెచ్చారు: డా.జగదీష్

నెల్లూరు: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నెల్లూరు శాఖ ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో బర్డ్ ఆసుపత్రి మాజీ సంచాలకులు, విర్డ్ ఆసుపత్రి ప్రస్తుత డైరెక్టర్, రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ అకాడమిక్ డీన్ డా.గుడారు జగదీష్ పాల్గొని వెన్నెముక గాయాలు, చికిత్సలో ఎదురయ్యే ఇబ్బందులను ఉపన్యసించారు. ఈ ఉపన్యాసానికి గాను.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ – ఆంధ్ర ప్రదేశ్ శాఖ తరపున నెల్లూరు ప్రజలు డా. బేరమ్మగా పిలిచుకునే డా. మేరియన్‌ ఓలేటా బేర్ స్మారకార్ధం బంగారు పతాకాన్ని డా. గుడారు జగదీష్‌కి బహుకరించారు.


ఈ సందర్భంగా డా. జగదీష్ మాట్లాడుతూ అమెరికాలో పుట్టినప్పటికీ భారతదేశంలో పేదలకు వైద్యాన్ని అందించిన మానవతామూర్తి డా. మేరియన్‌ ఓలేటా బేర్ అన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు పల్లెవాసులు సైతం రెండు చేతులెత్తి నమస్కరించే విధంగా ఆవిడ సేవలను అందించారని కొనియాడారు. 38 సంవత్సరాలపాటు నెల్లూరు, పరిసర ప్రాంతాలకు డా. మేరియన్‌ ఓలేటా బేర్ చేసిన సేవలలో భాగంగా 38 వేల ఆపరేషన్లు చేయడంతో పాటు అంబులెన్స్‌లు లేని రోజుల్లో తొలి అంబులెన్స్‌ను పరిచయం చేయడం, నర్సింగ్ కళాశాల ప్రారంభించడం వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని జగదీష్ తెలిపారు.

Updated Date - 2021-10-04T01:05:17+05:30 IST