May 14 2021 @ 11:15AM

'డాక్టర్' సెన్సార్ పూర్తి

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన 'డాక్టర్' సినిమా సెనార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కెజెఆర్ స్టూడియో రాజేష్ తో కలసి శివకార్తికేయన్ స్వయంగా నిర్మించాడు. మార్చి 26న విడుదల చేయాలనుకున్న చిత్ర బృందం అసెంబ్లీ ఎలక్షన్స్ రావటంతో వాయిదా వేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎప్పుడు రిలీజ్ చేయాలనే డైలమాలో ఉన్నట్టు సమాచారం. పరిస్థితులు చక్కబడితే వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సెన్సార్ పూర్తి చేసి సినిమాను రెడీ చేసినట్టు తెలుస్తోంది. 2గంటల 28 నిమిషాల నిడివితో సెన్సార్ పూర్తి చేసుకుని యు.ఎ. సర్టిఫికెట్ పొందిన 'డాక్టర్' సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారా లేక థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేచి చూస్తారా అన్నది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందించాడు.