డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఇస్తే మద్యం అమ్మొచ్చు

ABN , First Publish Date - 2020-03-30T09:45:00+05:30 IST

లాక్‌డౌన్‌తో మద్యం దొరక్క విలవిల్లాడుతున్న మందుబాబులకు కేరళ సర్కారు శుభవార్త చెప్పింది. తాము మందు లేకపోతే ఉండలేమన్నట్లు వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే మద్యం అమ్ముతామని

డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ ఇస్తే మద్యం అమ్మొచ్చు

  • ఎక్సైజ్‌ శాఖకు కేరళ సర్కారు ఆదేశాలు 

తిరువనంతపురం, మార్చి 29: లాక్‌డౌన్‌తో మద్యం దొరక్క విలవిల్లాడుతున్న మందుబాబులకు కేరళ సర్కారు శుభవార్త చెప్పింది. తాము మందు లేకపోతే ఉండలేమన్నట్లు వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే మద్యం అమ్ముతామని తెలిపింది. మద్యం దొరక్క రాష్ట్రంలో అనేక మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.  మద్యం కోసం డాక్టర్ల ప్రిస్ర్కిప్షన్‌ అవసరమన్న కేరళ సర్కారు నిర్ణయాన్ని  ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎమ్‌ఏ) ఖండించింది. మద్యం లేక మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి శాస్త్రీయంగానే వైద్యం అందించాలని ఐఎమ్‌ఏ కేరళ అధ్యక్షుడు అభిరామ్‌ అన్నారు.

Updated Date - 2020-03-30T09:45:00+05:30 IST