డాక్టర్‌ కుటుంబానికి రూ.25లక్షలు అందజేత

ABN , First Publish Date - 2021-06-17T07:48:28+05:30 IST

కొవిడ్‌ బాధితులకు సేవలందించే క్రమంలో వైరస్‌ బారిన పడి మరణించిన వైద్య, ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేందుకు ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

డాక్టర్‌ కుటుంబానికి రూ.25లక్షలు అందజేత
రోజి సోదరుడికి చెక్కును అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీలు

  • బాధితులకు సేవలందిస్తూ వైరస్‌ బారినపడి మృతి చెందిన రోజి..
  • సీఎం నిధి నుంచి చెక్కు పంపిణీ

భానుగుడి(కాకినాడ), జూన్‌ 16: కొవిడ్‌ బాధితులకు సేవలందించే క్రమంలో వైరస్‌ బారిన పడి మరణించిన వైద్య, ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను అన్ని విధాల ఆదుకునేందుకు ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నారని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన డాక్టర్‌ కందికట్ల రోజి ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసి అక్క డే హౌస్‌సర్జన్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల కరోనా బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం రోజి సోదరుడు రాకేష్‌కు సీఎం సహాయ నిధి కింద రూ.25 లక్షల చెక్కును బుధవారం కలెక్టరేట్‌లో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలతోపాటు, వైద్య, ఆరోగ్య, పోలీసు రెవెన్యూ, ఇలా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారని, దురదృష్టవశాత్తూ కొందరు మరణిస్తున్నార న్నారు. మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, ఈ క్రమంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న రోజి కుటుంబానికి సహాయం అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్‌ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి రాజకుమారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, డీపఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు పాల్గొన్నారు. 

కొవిడ్‌ నివారణకు నిరంతర పర్యవేక్షణ.. సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌

జిల్లాలో కొవిడ్‌ నివారణ చర్యలు, ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ  జరగాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో వర్చు వల్‌ విధానంలో స్పందన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో వివేకానంద సమా వేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్‌ డి మురళీధర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్‌ జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి. రాజకుమారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. జిల్లాలో అమలువుతున్న పేదలందరికీ ఇళ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్వహణ, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ లకు శాశ్వత భవన నిర్మాణాలు, ఖరీఫ్‌ సన్నద్ధతకు ప్రణాళికలు, శాశ్వత భూహక్కు, భూరక్ష తదితర అంశాలపై జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఎం హెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ గౌరీశ్వరరావు, డ్వామా పీడీ ఎ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T07:48:28+05:30 IST