Abn logo
May 28 2020 @ 21:40PM

డాక్టర్‌ సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారు: శ్రావణ్ కుమార్

అమరావతి: డాక్టర్‌ సుధాకర్‌కు అందిస్తున్న వైద్యం పట్ల అనుమానాలున్నాయని డాక్టర్ సుధాకర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ అన్నారు. సుధాకర్‌పై పిచ్చోడనే ముద్ర వేయాలనే ప్రయత్నం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. సుధాకర్‌ను మానసిక ఆస్పత్రికి ఎందుకు తరలించారనేది సందేహంగా ఉందన్నారు. వైద్యుడు సుధాకర్‌కు ప్రాణహాని ఉందని భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్‌ సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో డాక్టర్ సుధాకర్‌కు రక్షణ ఉంటుందనుకోవడంలేదని న్యాయవాది శ్రావణ్ కుమార్ తెలిపారు. 


కాగా డాక్టర్ సుధాకర్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని అభ్యర్థించారు. కోర్టు పర్యవేక్షణలో వైద్యం జరపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదని, ట్యాబ్లెట్ల వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement