క్లిక్‌ చేస్తే కళ్లెదుటకే వైద్యుడు!!

ABN , First Publish Date - 2020-03-26T08:39:18+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ వైద్యసేవలు పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఆ అవసరమే వస్తే రోజులో ఎప్పుడైనా 040-44550000 హెల్ప్‌లైన్‌ నంబరుకు...

క్లిక్‌ చేస్తే కళ్లెదుటకే వైద్యుడు!!

  • లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు చేదోడుగా సన్‌షైన్‌ హాస్పిటల్స్‌
  • ‘ఎంఫైన్‌’ భాగస్వామ్యంతో 24 గంటల ఉచిత హెల్ప్‌లైన్‌ 
  • ఫోన్‌ నంబరు 040-44550000 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ వేళ వైద్యసేవలు పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఆ అవసరమే వస్తే రోజులో ఎప్పుడైనా 040-44550000 హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే సరిపోతుందని హైదరాబాద్‌కు చెందిన సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.వి.గురవారెడ్డి అంటున్నారు. లాక్‌డౌన్‌ గడ్డుకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ఆందోళనకు గురికాకుండా తమ కాల్‌సెంటర్‌ నంబర్‌కు ఫోన్‌చేసి.. పేరు, నివాసిత ప్రాంతం, ఫోన్‌ నంబరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫోన్‌ చేసిన రోగి/రోగి కుటుంబీకుడి నంబరుకు ఒక వెబ్‌లింక్‌ వెళ్తుందని, దాన్ని క్లిక్‌ చేయగానే వైద్యుడు వీడియోకాల్‌లో ప్రత్యక్షమవుతాడని తెలిపారు.


కాల్‌లోనే ఔషధాలను సిఫారసు చేయాలా? ఆస్పత్రికి రమ్మని చెప్పాలా? సమీపంలోని ఆస్పత్రికి వెళ్లమని సూచించాలా? వీటిలో ఏ సలహా ఇవ్వాలనేది రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారని గురవారెడ్డి చెప్పారు. ఈవిధంగా 50 మంది సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ వైద్యులు ప్రజలకు హెల్ప్‌లైన్‌లో సలహాలు ఇవ్వడానికి 24 గంటలపాటు కాల్‌సెంటర్‌లో సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. లాక్‌డౌన్‌ గడ్డుకాలంలో ప్రజలకు స్నేహితుడిలా సాయం చేయాలనే లక్ష్యంతో ‘ఎంఫైన్‌’ ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ కంపెనీ సహ భాగస్వామ్యంతో ఈ సేవను పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2020-03-26T08:39:18+05:30 IST