వైద్యులే మన పోరాటయోధులు

ABN , First Publish Date - 2020-04-09T07:47:01+05:30 IST

‘ప్రస్తుత సంక్షుభిత తరుణంలో డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే మన పోరాటయోధులు. వారిని ఎలాగైనా కాపాడుకోవాలి’ అని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టంచేసింది. కరోనా చికిత్సలో నిమగ్నమైన సిబ్బందికి...

వైద్యులే మన పోరాటయోధులు

  • సరిపడా పీపీఈలు ఉండేలా చూడండి
  • వైద్యసిబ్బందిని కాపాడండి
  • కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుత సంక్షుభిత తరుణంలో డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. వారే మన పోరాటయోధులు. వారిని ఎలాగైనా కాపాడుకోవాలి’ అని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టంచేసింది. కరోనా చికిత్సలో నిమగ్నమైన సిబ్బందికి తగు సంఖ్యలో వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈలు) ఉండేలా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించింది.  ‘వైద్యులు, పారామెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ ఈ పీపీఈలు అందుబాటులో ఉండేట్లు చూడాలి.. అవి కూడా డబ్ల్యూ హెచ్‌ వో గైడ్‌లైన్స్‌ ప్రకారం రూపొందినవే అయి ఉండాలి.. ఈమేరకు కేంద్రానికి ఆదేశివ్వాలి’ అని కోరుతూ నాగ్‌పూర్‌కు చెందిన ఓ డాక్టరు, ఓ అడ్వొకేటు, మరో సామాజిక సంస్థ దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఒకేసారి విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.


దీనిపై ప్రభుత్వం తరఫున స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా- ‘దేశంలోని అన్ని కరోనా ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి తగినన్ని పీపీఈలు ఉన్నాయని, కొరత రానీయబోమని’ వివరించారు. వైద్య సిబ్బందికి పూర్తి స్థాయి భద్రత, రక్షణ కల్పించడానికి  ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, వారు నిజంగా పోరాట యోఽధులేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.  వైద్య సిబ్బందికి జీతాల్లో కోత విధిసున్నట్లు వచ్చిన వార్తలను మెహతా ఖండించారు. ఏ రాష్ట్రంలోనూ ఇది లేదన్నారు. డాక్టర్లు తమ పర్సు నుంచి డబ్బు పెట్టుకుని పీపీఈలు కొనుక్కునే పరిస్థితీ లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-09T07:47:01+05:30 IST