కోవిషీల్డ్ కావాలంటున్న ఢిల్లీ ఆర్ఎంఎల్ వైద్యులు

ABN , First Publish Date - 2021-01-16T22:23:25+05:30 IST

కోవిడ్‌పై ప్రభుత్వ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రారంభమైన నేపథ్యంలో తమకు సెరుం ఇన్‌స్టిట్యూట్ ..

కోవిషీల్డ్ కావాలంటున్న ఢిల్లీ ఆర్ఎంఎల్ వైద్యులు

న్యూఢిల్లీ: కోవిడ్‌పై ప్రభుత్వ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రారంభమైన నేపథ్యంలో తమకు సెరుం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్ కావాలని ఢిల్లీ రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లు కోరారు. భారత్ బయోటెక్ కొవ్యాక్సిన్ ట్రయిల్స్ పూర్తి కానందున దానికి బదులుగా తమకు కోవిషీల్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం మాత్రం, ప్రజల భయాందోళనలను కొట్టిపారేస్తూ, రెండు వ్యాక్సిన్ల అభివృద్ధి చాలా కృషి జరిగిందని చెబుతోంది. కాగా, కొవాక్సిన్ ఇస్తామంటే తమలో తక్కువ మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఉందని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని ఒక లేఖ ద్వారా మెడికల్ సూపరింటెండెంట్‌కు వారు తెలియచేశారు. టీకాల ప్రారంభానికి ముందు అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకున్న కోవిషీల్డ్‌‌ను తమకు ఇవ్వాలని ఆ లేఖలో వారు కోరారు. ఆర్ఎంఎల్ రెసిడెండ్ టాక్టర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ నిర్మలయ మహోపాత్ర మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రైవ్ ఇవాళ ప్రారంభమైనప్పటికీ చాలా మంది డాక్టర్లు ఇంకా తమ పేర్లు ఇవ్వలేదన్నారు. కోవ్యాక్సిన్ పట్ల తమకు భయాలున్నాయని, కొవ్యాక్సిన్ ట్రయిల్స్ ఇంకా పూర్తి కానందున తాము కోవాక్సిన్‌కు బదులుగా కోవిషీల్డ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

Updated Date - 2021-01-16T22:23:25+05:30 IST